Kishan Reddy: బల్దియాపై బీజేపీ జెండా ఎగరాలన్న కిషన్ రెడ్డి
ఈ ఏడాది చివరిలో జరగబోయే GHMC ఎన్నికల్లో బీజేపీ గెలవాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అలానే నగర కార్పొరేటర్లు త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు చోట్ల నిలిచిన అభ్యర్ధులు విజయం సాధించేలా బాధ్యతలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన లంకెల దీపక్‌రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనూ కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

బల్దియా బాద్‌షాగా బీజేపీ నిలవాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. GHMC మేయర్ పీఠాన్ని కమలం పార్టీ దక్కించుకోవాలన్నారు ఆయన. ఈ ఏడాది చివరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలవాలన్నారు కిషన్ రెడ్డి. మజ్లిస్ అహంకాపూరితంగా వ్యవహరిస్తోందన్నారు కేంద్ర మంత్రి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మజ్లిస్ కోరలు పీకాలని బీజేపీ లీడర్లు, కేడర్‌కు ఆయన పిలుపునిచ్చారు. GHMC భవనంపై బీజేపీ జెండాను ఎగురవేయడానికి పార్టీ నేతలు, కార్యకర్తలు సమాయత్తం కావాలన్నారు కిషన్ రెడ్డి. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ పరిపాలన చూశామని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పరిస్థితి మరింత అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు కిషన్ రెడ్డి.
హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా లంకెల దీపక్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు.
Live: Participating in the assumption of charge program of BJP Hyderabad Central City President, at the party office in Barkatpura, Hyderabad. https://t.co/VfFnZ0w7Xq
— G Kishan Reddy (@kishanreddybjp) February 9, 2025