Heart Breaking Incident: చావు.. పుట్టుకల మధ్య సాగేది మనిషి జీవితం.. ఈ అక్షర సత్యం అందరికీ తెలుసు. కానీ వీటి గురించి తెలియని పసితనం అది. తన తల్లి బ్రతికే ఉందని అనుకునే చిన్నతనం అది. చనిపోయిన తన తల్లికి ఓ చిన్నారి సపర్యలు చేసింది. అది చూసిన స్థానికులు కన్నీటి పర్యంతం అయ్యారు. మనసును కదిలించే ఈ ఘటన సూర్యాపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
సూర్యపేటలోని శ్రీశ్రీనగర్ కాలనీ రోడ్డులో ఓ గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. ఆమె ఎవరు.? స్థానికంగా ఉండే మహిళేనా.? లేక అనాధా.? లేకపోతే వేరే ఊరు నుంచి పని కోసం వచ్చి మృతి చెందిందో తెలియదు.. ఆమె మృతదేహం పక్కనే నాలుగేళ్ల చిన్నారి ఉంది. తన తల్లి చనిపోయిందన్న విషయం తెలియని ఆ చిన్నారి.. ఆమెకు సపర్యలు చేసింది. మృతదేహంపై ఉన్న దుప్పటిని సరిచేయడం లాంటి పనులు చేయడంతో.. అది చూసిన అందరూ కంటతడి పెట్టుకున్నారు.
గురకపెట్టి నిద్రపోయిన కాపలా కుక్క.. గన్ పెట్టి షాపును దోచుకున్న దొంగ.. మధ్యలో అదిరిపోయే ట్విస్ట్..!
లోదుస్తులను మాస్క్‌గా ధరించిన మహిళ.. వీడియో వైరల్.. నెట్టింట నవ్వులు పువ్వులు..
పవన్ కళ్యాణ్‌కు నాలుగో భార్యగా ఉంటాను.. నెటిజన్ ప్రశ్నకు ఆషూ ఆన్సర్.. వైరల్ ట్వీట్.!
Bigg Boss Season 5: బిగ్ బాస్ సీజన్ 5.. రేసులో ఉన్న కంటెస్టెంట్లు వీరే.. వివరాలు ఇవే..!