Drushyam Movie Crime: అయ్య బాబోయ్…దృశ్యం సినిమాను మించిన క్రైమ్‌ స్టోరీ.. ఖాకీలే కంగుతినేలా..

| Edited By: Jyothi Gadda

Oct 28, 2023 | 6:03 PM

Suryapet: రఫీ మృతిపై ఆయన సోదరుడు సుభాన్ అనుమానం వ్యక్తం చేశాడు. రఫీ శరీరంపై కొట్టిన గాయాలు ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చి నస్రీన్ కాల్‌డేటాను పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు సినీ ఫక్కీలో చాకచక్యంగా విచారణ చేసి కేసును ఛేదించడంతో నిందితుల కుట్ర బట్టబయలైంది . రఫీని హత్య చేసిన నలుగురిని రిమాండ్ చేసినట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు.

Drushyam Movie Crime: అయ్య బాబోయ్...దృశ్యం సినిమాను మించిన క్రైమ్‌ స్టోరీ.. ఖాకీలే కంగుతినేలా..
Suryapet Murder Case
Follow us on

దృశ్యం సినిమాలో క్రైమ్ సీన్ గుర్తుందా అచ్చం అలాంటి సీన్ ని తలదన్నేలా పోలీసులకు మరో దృశ్యం సినిమాను చూపించారు కేటుగాళ్ళు. వివాహేతర సంబంధాల మోజులో హత్యలు చేసి హంతకులుగా మారుతున్నారు. ప్రియుడి మోజులో భార్య , ప్రియురాలి మోజులో భర్త.. కట్టుకున్న వారినే కడతేరుస్తున్నారు. కామం కోసం కీరాతకంగా మారాడమే కాదు ఏకంగా చట్టానికి దొరక్కుండా ఉండడానికి క్రైమ్‌ సినిమాల ప్రేరణతో మరో దృశ్యాన్నీ సృష్టిస్తున్నారు. దృశ్యం సినిమాను పోలిన రియల్‌ క్రైమ్‌ స్టోరీ ఒకటి వెలుగులోకి వచ్చింది.. ఈ దృశ్యం కథేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ పూర్తిగా చదవాల్సిందే…

పోలీసులు తెలిపిన వివరాల మేరకు..దృశ్యం సినిమాను తలదన్నే విధంగా జరిగిన హత్యలు సూర్యాపేటలో కలకలం రేపాయి. అక్రమ సంబంధం నేపథ్యంలో అడ్డుగా ఉన్న వారిని కిరాతకంగా హత్యచేసి ప్రమాదంగా, ఆత్మహత్యగా చిత్రీకరించి చివరకు పోలీస్ ఇంటెలిజెన్స్ ముందు దొరికిపోయి నిందితులు కటకటాలపాలయ్యారు. సూర్యాపేటలోని శ్రీరామ్ నగర్ లో నివాసం ఉండే షైక్ రఫీ ఈ నెల 9న ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎలాంటి సమస్యలు లేని రఫీ ఉరి వేసుకోవడాన్నీ అనుమానించి రఫి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం రిపోర్టులో హత్య జరిగిన ఆనవాళ్ళు కనిపించడంతో పోలీసులు కేసును మరింత లోతుగా విచారణ చేపట్టారు. పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేపట్టగా..దృశ్యం సినిమా కనబడింది. మృతుడి బార్యను విచారించగా భూక్యా వెంకన్నతో అక్రమసంబంధం నేపథ్యంలో హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది.

కొంతకాలంగా వెంకన్న, నస్రీన్‌లు అక్రమ సంబంధం కొనసాగిస్తున్న విషయం నస్రీన్ ఇంట్లో తెలిసిపోవడంతో ఎలాగైనా వెంకన్న భార్యని, నస్రీన్ భర్తని అడ్డుతొలగించుకుని సుఖంగా ఉండాలని పథకం వేశారు. పథకంలో భాగంగా ఈ ఏడాది జూన్ 8న భూక్యా వెంకన్న తన భార్య రమాదేవిని బళ్లుతండా నుంచి సూర్యాపేటకు ద్విచక్ర వాహనంపై తీసుకుని వస్తుండగా, దారిలో వాహనం నిలిపి భార్యను విద్యుత్తు స్తంభానికి కొట్టి హత్య చేశాడు. ఆమె రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు అందరినీ నమ్మించాడు. ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా చివ్వెంల పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

మూడు నెలల తర్వాత తన ఇద్దరు స్నేహితులు అక్కినపల్లి శ్రీశైలం, సారగండ్ల మధుల సహాయంతో రఫీని సైతం నస్రీన్ సహాయంతో హత్య చేసేందుకు పథకం వేశారు. ఈ నెల 9వ తేదీన రాత్రి 10.30 గంటల సమయంలో రఫీ బయటకు వెళ్లిన విషయాన్ని నస్రీన్‌ ఫోన్ చేసి వెంకన్నకు చెప్పింది. ఇదే అదునుగా వెంకన్న, శ్రీశైలం, మధులు నస్రీన్ ఇంట్లో దాక్కున్నారు. అరగంట తర్వాత ఇంటికి చేరుకున్న రఫీని వారంతా కలిసి గొంతు నిలిమి కిరాతకంగా హత్య చేశారు. రఫీ గొంతుకు చీరను బిగించి.. సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడదీసి రఫీ ఆత్మహత్య చేసుకున్నాడని చిత్రీకరించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

రఫీ మృతిపై ఆయన సోదరుడు సుభాన్ అనుమానం వ్యక్తం చేశాడు. రఫీ శరీరంపై కొట్టిన గాయాలు ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చి నస్రీన్ కాల్‌డేటాను పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు సినీ ఫక్కీలో చాకచక్యంగా విచారణ చేసి కేసును ఛేదించడంతో నిందితుల కుట్ర బట్టబయలైంది . రఫీని హత్య చేసిన నలుగురిని రిమాండ్ చేసినట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..