Telangana: ఆ ఒక్క సీటునే ఎందుకు పెండింగ్‌లో పెట్టినట్లు.? ఇంతకీ కాంగ్రెస్ ఎత్తుగడ ఎంటీ.?
ప్రధాన రాజకీయ పార్టీలో అభ్యర్థులు ఎవరనేది దాదాపుగా తేలిపోయింది. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ కొన్ని స్థానాలు మినహా దాదాపు అన్ని స్థానాల్లో అభ్యర్థుల పేర్లు ప్రకటించాయి. దీంతో అభ్యర్థులంతా వివిధ ప్రచార వస్త్రాలతో రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థులపై మాటల తూటాలతో దూసుకుపోతున్నారు. అయితే వరంగల్ ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఇప్పటికే 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు...

కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు రంగాలోకి దిగారు. ఇష్ట దైవాన్ని ప్రసన్నం చేసుకొని ప్రచారంలో స్పీడ్ పెంచారు. కానీ వరంగల్ ఉమ్మడి జిల్లాలో కేవలం ఒక్క నియోజక వర్గంలో మాత్రమే కాంగ్రెస్ క్యాడర్ పరేషాన్ లో ఉన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 11 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల జాబితా ప్రకటించిన అధిష్టానం ఆ ఒక్క నియోజకవర్గాన్ని మాత్రమే ఎందుకు పెండింగ్ పెట్టింది.? ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది..? అక్కడి నుంచి ఎవరిని బరిలోకి దింపబోతున్నారు..? లాంటి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
ప్రధాన రాజకీయ పార్టీలో అభ్యర్థులు ఎవరనేది దాదాపుగా తేలిపోయింది. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ కొన్ని స్థానాలు మినహా దాదాపు అన్ని స్థానాల్లో అభ్యర్థుల పేర్లు ప్రకటించాయి. దీంతో అభ్యర్థులంతా వివిధ ప్రచార వస్త్రాలతో రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థులపై మాటల తూటాలతో దూసుకుపోతున్నారు. అయితే వరంగల్ ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఇప్పటికే 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. కేవలం ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజక వర్గం అయిన డోర్నకల్ నియోజకవర్గం అభ్యర్థి నియామకం మాత్రమే పెండింగ్ పెట్టారు. దీంతో డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం పరేషాన్ అవుతోంది.
డోర్నకల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కంచుకోట అనే విషయం తెలిసిందే. ఈ నియోజక వర్గంలో ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగగా.. అందులో 13 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే ఈ నియోజకవర్గం నుండి ముగ్గురు నేతలు టికెట్ రేస్ లో పోటీ పడుతున్నారు. రాoచంద్రనాయక్, నెహ్రూనాయక్ భూపాల్ నాయక్ డోర్నకల్ టికెట్ కోసం గట్టీగానే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అధిష్టానానికి వారి బల నిరూపణను సైతం చూపించారు.
ఒకవైపు పార్టీ అధిష్టానం కూడా సర్వేలు చేస్తుంది. శుక్రవారం ప్రకటించిన జాబితాలో కచ్చితంగా అన్ని నియోజకవర్గాలతో పాటు డోర్నకల్ నియోజకవర్గం అభ్యర్థిని కూడా ప్రకటిస్తారని అంతా భావించారు.. కానీ అసహవహులకు, వారి అనుచరులకు నిరాశే మిగిలింది. మొదట రాంచంద్రనాయక్‌కు టిక్కెట్ వస్తుందని ప్రచారం జరిగింది. కానీ సర్వేలు, పార్టీ క్యాడర్ భూపాల్ నాయక్‌కు సపోర్ట్‌గా ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో టికెట్ ఆపారని, భూపాల్ నాయక్‌కు టిక్కెట్ కేటాయించే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
ఇప్పటికే టిక్కెట్ ప్రకటించిన కొన్ని నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ వార్ గందగోళానికి దారి తీస్తోంది. టిక్కెట్ దక్కని ఆశావాహులు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి రంగంలోకి దదిగేందుకు సిద్దమవుతున్నారు. ఇదిలా ఉంటే భూపాల్ నాయక్ వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో కుల, సంఘాలు లంబాడీలు, వివిధ ప్రజా సంఘాలు సమన్వయ సమావేశాలు ఏర్పాటుచేసుకొని టికెట్ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. హస్తినలో మఖాం వేసిన ఈ ముగ్గురునేతలు టికెట్ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరి కాంగ్రెస్ అధిష్ఠానం ఎవరికి టిక్కెట్ కట్టబెడుతుందో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..