Telangana: 25 ఏళ్లకు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భావోద్వేగ సన్నివేశాలు
నరసాపురం సూది రెడ్డి నాగిరెడ్డి ఆది లక్ష్మమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ హై స్కూల్ 2000 - 2001 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. అప్పటి మిత్రులంతా నాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ అందరూ ఆనందంగా గడిపారు.

25 ఏళ్ల క్రితం కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ గెట్ గెదర్ పెట్టుకున్నారు. ఈ సందర్భంగా బోలెడన్ని భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నరసాపురం సూది రెడ్డి నాగిరెడ్డి ఆది లక్ష్మమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో 2000 – 2001 పదవ తరగతి బ్యాచ్‌కి చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మిత్రులంతా అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆటపాటలతో సరదాగా గడిపారు. అప్పుడు తమకు చదువుచెప్పిన టీచర్స్‌ను సన్మానించారు.
వీరందరూ ఇదే స్కూల్లో చదువుకొని పదవ తరగతి పూర్తి అయిన తర్వాత.. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లి సెటిల్ అయ్యారు. 2011లో అందరూ కలుసుకొని మొదటిసారిగా గెట్ టుగెదర్ ప్రోగ్రాం పెట్టుకున్నారు. అప్పటినుంచి వీరందరూ ఒక గ్రూపుగా ఏర్పడి తమలో ఎవరికైనా సమస్యలు ఉంటే తోడ్పాడును అందించడం వంటివి చేస్తున్నారు. అందులో భాగంగానే మళ్లీ 14 సంవత్సరాల తర్వాత ఆదివారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకొని తమకు విద్యాబోధన చేసిన గురువులకు సన్మానం చేసి వారికి జ్ఞాపికలను అందజేశారు. అంతేకాకుండా చిన్ననాటి నుంచి తమతో పాటు చదువుకుని ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ముగ్గురు స్నేహితుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు.
వీడియో దిగువన చూడండి…
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




