Telangana: మహిళలకు ఉచిత ప్రయాణంపై రోడ్డెక్కిన విద్యార్థులు.. కారణం ఏంటంటే..
రాష్ట్రవ్యాప్తంగా ఇదే సమస్య కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అటు ఆటో యూనియన్లు సైతం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలని.. ఈ పథకంతో గిరాకీలి లేక రోడ్డున పడుతున్నామని.. మా పొట్ట మీద కొట్టొద్దంటూ రోడ్డెక్కి నిరసనలు ఆందోళన చేస్తున్నారు ఆటో డ్రైవర్లు. ఇప్పుడు ఈ లిస్టులోకి విద్యార్థులు సైతం వచ్చి చేరారు. మాకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం రావాల్సిన బస్సులు నిండుగా వస్తున్నాయని.....

మహిళలకు ఉచిత బస్సు ప్రకటన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో రద్దీ తారస్థాయికి చేరింది. ఆర్టీసీ బస్సుల్లో మునుపెన్నడు లేని విదంగా మహిళల ప్రయాణాలు పెరగడం.. బస్సులు రద్దీగా కనిపించడం.. అటు స్టేజీల్లో ఆర్టీసీ బస్సులు ఆగే పరిస్థితి కూడా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఇదే సమస్య కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అటు ఆటో యూనియన్లు సైతం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలని.. ఈ పథకంతో గిరాకీలి లేక రోడ్డున పడుతున్నామని.. మా పొట్ట మీద కొట్టొద్దంటూ రోడ్డెక్కి నిరసనలు ఆందోళన చేస్తున్నారు ఆటో డ్రైవర్లు. ఇప్పుడు ఈ లిస్టులోకి విద్యార్థులు సైతం వచ్చి చేరారు. మాకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం రావాల్సిన బస్సులు నిండుగా వస్తున్నాయని.. రద్దీ కారణంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయలేకపోతున్నామని.. మాకు పాసులు ఉన్నా.. మా కోసం బస్సులు ఆపడం లేదని రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు అక్కడి విద్యార్థులు. మా బస్సులు మాకు వేయండి మహాప్రభువు అంటూ ప్రభుత్వాన్ని.. ఆర్టీసీ అదికారులను వేడుకుంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేక సమస్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. అటు మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని బస్ స్టాండ్ నుండి కోటపల్లి మెడల్ స్కూల్ కి వెళ్లి చదువుకునే విద్యార్థులకు సరిపడా బస్సు లు లేక తాము నానా ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డెక్కుతున్నారు మోడల్ స్కూల్ విద్యార్థులు. సమయానికి బస్సులు లేక ఉన్న బస్సుల్లోను రద్దీ కారణంగా ప్రయాణాలు చేయలేక క్లాసులకు దూరమవుతున్నామని.. మమ్మల్ని స్కూల్ కు దూరం చేసే ఈ పథకాన్ని నిలిపివేయాలంటూ.. చెన్నూరు బస్ స్టాండ్ లో వీవాంట్ బస్సెస్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు కోటపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు.
ఉదయం వేళలో రెండు బస్‌లు మాత్రమే అటుగా వెళ్తాయని.. కానీ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం నిర్ణయంతో ఆ రెండు బస్సులు నిత్యం రద్దీగా ఉంటున్నాయని.. ప్రయాణికుల తాకిడితో మేము స్కూల్ కు వెళ్లలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత బస్ ప్రయాణం పథకం అమలు తర్వాత నుంచి నిత్యం ఇదే సమస్య తలెత్తుతోందని.. ప్రభుత్వ నిర్ణయం మమ్మల్ని చదువులకు దూరం చేసేలా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాము పదవ తరగతి చదువుతున్నామని సమయానికి బస్‌లు లేక స్కూల్‌కి ఆలస్యంగా వెళ్లే పరిస్థితులు తలెత్తాయని ఇది ఇలాగే కొనసాగితే మా భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని కోటపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసి, బస్‌ల సంఖ్యను పెంచి తమకు ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..