Chinna Jeeyar Swamy: గవర్నర్ తమిళిసైతో సమావేశమైన చినజీయర్ స్వామి.. రామానుజ విగ్రహావిష్కరణకు ఆహ్వానం

| Edited By: Anil kumar poka

Feb 01, 2022 | 5:17 PM

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) తో త్రిదండి చినజీయర్ స్వామి (Chinna jeeyar swamy) మంగళవారం కలిశారు.

Chinna Jeeyar Swamy: గవర్నర్ తమిళిసైతో సమావేశమైన చినజీయర్ స్వామి.. రామానుజ విగ్రహావిష్కరణకు ఆహ్వానం
Follow us on

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ (Tamilisai Soundararajan)ను త్రిదండి చినజీయర్ స్వామి (Chinna jeeyar swamy) మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా త్వరలో జరిగే రామానుజచార్యుల (Ramanujacharya) సహస్రాబ్ధి ఉత్సవాలకు హాజరుకావాలని గవర్నర్‌కు ఆహ్వానపత్రం అందించారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు సుమారు రెండు వారాల పాటు  సమతా మూర్తి పేరిట భగవత్ రామానుజచార్యుల సహస్రాబ్ధి (1000వ జయంతి)  ఉత్సవాలు జరగనున్నాయని చినజీయర్ స్వామి తెలిపారు. తెలంగాణ గవర్నర్‌ను కలిసిన వారిలో మై హోం గ్రూప్ అధినేత రామేశ్వరరావు తనయుడు కూడా ఉన్నారు.

కాగా శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి.  ఇందులో భాగంగా 216 అడుగుల రామానుజాచార్యుని పంచలోహ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.  ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖులను స్వయంగా కలిసి  ఉత్సవాలకు రావాలని ఆహ్వానిస్తున్నారు చినజీయర్ స్వామి.  ఇందులో భాగంగా మూడు రోజుల క్రితం తమిళనాడు గవర్నర్  ఆర్ ఎన్ రవిని కూడా స్వయంగా కలిశారు చినజీయర్ స్వామి, మై హోం గ్రూప్ అధినేత రామేశ్వరరావు.  సహస్రాబ్ధి ఉత్సవాలకు రావాలని ఆహ్వానించారు.

 

Also read: Anil Ambani Son Wedding: త్వరలో అంబానీ ఇంట మరో గ్రాండ్ వెడ్డింగ్.. నెట్టింట వైరలవుతోన్నఅనిల్ అంబానీ కుమారుడి ప్రి వెడ్డింగ్ ఫొటోస్..

Coronavirus: శాంతిస్తోన్న కరోనా.. వరుసగా రెండో రోజూ తగ్గిన కొత్త కేసులు.. నిన్న ఎంతమంది వైరస్ బారిన పడ్డారంటే..

Viral Video: ఆ కారు డ్రైవర్ యూటర్న్ తీసుకునేందుకు 80 నిమిషాలు తీసుకున్నాడు.. కారణమేంటంటే..