Telangana: తెలంగాణలో రాక్షసబల్లుల కాలం నాటి‘స్పినోడాన్‌’.. గుర్తించిన శాస్త్రవేత్తలు..

| Edited By: Ravi Kiran

Oct 04, 2022 | 10:00 AM

దాదాపు ఆరున్నర కోట్ల ఏళ్ల క్రితం ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొని ప్రళయం సంభవించింది. అప్పట్లో రాక్షస బల్లులు అంతమయ్యాయి. కానీ తొండలా ఉండే ఓ జీవి మాత్రం..

Telangana: తెలంగాణలో రాక్షసబల్లుల కాలం నాటి‘స్పినోడాన్‌’.. గుర్తించిన శాస్త్రవేత్తలు..
Sphenodon
Follow us on

దాదాపు ఆరున్నర కోట్ల ఏళ్ల క్రితం ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొని ప్రళయం సంభవించింది. అప్పట్లో రాక్షస బల్లులు అంతమయ్యాయి. కానీ తొండలా ఉండే ఓ జీవి మాత్రం ఆ పరిస్థితిని తట్టుకుని.. న్యూజిలాండ్, అర్జెంటీనా ప్రాంతాల్లో బతకగలిగింది. ఆ జీవులు న్యూజిలాండ్‌లోని పలు ద్వీపాల్లో మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇది చాలామంది పరిశోధకులు చెప్పే కథనం.

అలా ఆ విపత్తును తట్టుకుని బతికిన ఆ జీవుల పేరు స్పినోడాన్‌.. న్యూజిలాండ్‌లో వాటిని టువాటరా అని పిలుస్తారు. అయితే ఇప్పుడు అమెరికా కేంద్రంగా వెలువడే సైన్స్‌ జర్నల్‌ ‘వెర్టిబ్రేట్‌ పేలియంటాలజీ’ కొత్త విషయాన్ని ప్రపంచం ముందుంచింది. నాటి ప్రళయం నుంచి తెలంగాణలోని నష్కల్‌ ప్రాంతంలోనూ స్పినోడాన్‌ బతికి నిలిచింది.

భూమిని భారీ గ్రహశకలం ఢీకొన్న తర్వాత న్యూజిలాండ్, అర్జెంటీనాలలో తప్ప మరెక్కడా ఈ ప్రజాతి జీవులు బతికిలేవని ఇంతకుముందు జరిగిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కానీ తెలంగాణలో వికారాబాద్‌కు సమీపంలోని నష్కల్‌లోనూ బతికాయని ఇటీవల గుర్తించారు. నష్కల్‌లో జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో పరిశోధనలు జరిగాయి. ఈ ప్రాంతంలో స్పినోడాన్‌ జీవులు తిరగాడినట్టు జీఎస్‌ఐ నిర్ధారించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..