Telangana Police: జాతీయ స్థాయికి తెలంగాణ పోలీస్ ఖ్యాతి.. ముచ్చింతల్ సెక్యూరిటీ రోల్ మోడల్‌పై ఎస్పీజీ హ్యాపీ..

| Edited By: Shaik Madar Saheb

Feb 14, 2022 | 1:05 PM

SPG Praises Telangana Police: ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చింతల్ పర్యటనలో తెలంగాణ పోలీసులు కల్పించిన భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ మెచ్చు్కుంది. ఇదే అంశంపై ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చర్చ జరుగుతోంది.

Telangana Police: జాతీయ స్థాయికి తెలంగాణ పోలీస్ ఖ్యాతి.. ముచ్చింతల్ సెక్యూరిటీ రోల్ మోడల్‌పై ఎస్పీజీ హ్యాపీ..
Pm Narendra Modi
Follow us on

SPG Praises Telangana Police: ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చింతల్ పర్యటనలో తెలంగాణ పోలీసులు కల్పించిన భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ మెచ్చు్కుంది. ఇదే అంశంపై ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చర్చ జరుగుతోంది. ఇటీవల పంజాబ్‌లో సెక్యూరిటీ బ్రీచ్‌ తర్వాత మొదటి పర్యటనగా ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి సైబరాబాద్‌ పోలీసులు ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లపై ఎస్పీజీ (SPG) డైరెక్టర్‌ నుంచే ప్రశంసలు రావడం దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసుల (Telangana Police) ఖ్యాతి పెరిగిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 12 రోజుల పాటు జరిగిన ముచ్చింతల్‌ శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానితో పాటు 12 మంది కేంద్రమంత్రులు పాల్గొన్నారు. జడ్ ప్లస్, జెడ్‌ కేటగిరీ, వై కేటగిరీ కలిగిన పలువురు ప్రముఖుల రాక సందర్భంగా ముచ్చింతల్‌ శ్రీరామనగరంలో భద్రతా ఏర్పాట్లు తెలంగాణ పోలీసులకు సవాలుగా నిలిచాయి. సైబరాబాద్‌ సిపీ స్టీఫెన్‌ రవీంద్ర చాలా రోజుల క్రితం నుంచే ప్రముఖులకు కల్పించాల్సిన భద్రతా ఏర్పాట్లపై దృష్టిసారించారు. 7 వేల మంది పోలీసులతో పకడ్భందీ భద్రతా చర్యలు తీసుకున్నారు. ఎలాంటి భద్రతా వైఫల్యం లేకుండా వీఐపీ మూమెంట్‌ని, సాధారణ పబ్లిక్‌ని బ్యాలెన్స్‌ చేసిన విధానం అందరి మెప్పు పొందుతోంది.

ప్రధానంగా ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఎస్పీజీ అధికారులు మూడు రోజుల ముందుగానే ముచ్చింతల్ ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని భద్రతా ఏర్పాట్లను సూపర్‌వైజ్‌ చేశారు. హైదరాబాద్‌లో సాగిన ప్రైమ్ మినిస్టర్‌ నరేంద్ర మోదీ ఒకరోజు పర్యటనలో ఇక్రిశాట్‌తో పాటు ముచ్చింతల్‌లో దాదాపు 5 గంటల పాటు ఉండడంతో భద్రతని సవాల్‌గా తీసుకున్నారు సైబరాబాద్‌ పోలీసులు. ప్రధానమంత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగినప్పటి నుంచి.. అక్కడి నుంచి ఇక్రిశాట్‌కి.. ఇక్రిశాట్‌ నుంచి ముచ్చింతల్‌కు.. ముచ్చింతల్‌ నుంచి రోడ్డు మార్గాన ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వరకు భద్రతనంతా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కా ప్లాన్‌తో నిర్వహించారు. ఈ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్రని ఎస్పీజీ డైరెక్టర్‌ జనరల్‌ ప్రశంసించడం విశేషం.

Statue Of Equality

ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌తో 260 సీసీ కెమెరాలతో ప్రధానమంత్రి ఎంట్రీ నుంచి యాగశాల, రామానుజ విగ్రహం, లేజర్‌షో, పూర్ణహారతి నుంచి వెళ్లే వరకు 14 రూట్లలో 5 వేల మంది పోలీసులతో ప్రధాని రూట్లో చీమ సైతం దూరకుండా చేసిన ఏర్పాట్లకు ఎస్పీజీ అధికారులు ఫిదా అయ్యారు. పంజాబ్‌లో ప్రధాని సెక్యూరిటీ బ్రీచ్‌ తర్వాత ఇలాంటి ఏర్పాట్లు ఎక్కడా చూడలేదని, ఇకపై ప్రధాని ప్రైవేట్‌ టూర్లకు ముచ్చింతల్‌ సెక్యూరిటీ ప్రణాళికను తమకు ఇవ్వాలని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్రను ఎస్పీజీ కోరడం తెలంగాణ పోలీసుల ఘనతగా సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర పేర్కొన్నారు. ఇక్రిశాట్‌ సైతం సైబరాబాద్‌ పోలీసులు ఏర్పాటు చేసిన భద్రతకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక సందేశాన్ని ఇచ్చినట్టు తెలిపారు.

బీజేపీ నేతలు సైతం ప్రధాని రిసీవింగ్‌ సమయంలో, ఇక్రిశాట్‌లో రిసీవింగ్‌ సమయంలో, వీడ్కోలు సమయంలో 300 మందికి ఎంట్రీ ఇవ్వడంపై బీజేపీ నేతలు సైతం పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు భక్తుల నుంచిగానీ, వీఐపీల నుంచిగానీ ఎలాంటి ఫిర్యాదులుగానీ, ట్రాఫిక్‌జామ్‌ గానీ జరగకుండా చూశామంటే తెలంగాణ పోలీసుల ముందస్తు ప్రణాళికలో భాగమేనని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. 12 రోజుల పాటు 50 మంది వీఐపీలు వచ్చినా సెక్యూరిటీ విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయకుండా భద్రత ఏర్పాట్లు చేసినట్టు తెలంగాణ పోలీసు శాఖ పేర్కొంటోంది.

Ts Police

Also Read: 

BSP: ఏనుగు గుర్తుపై మొదటిసారి గెలిచింది ఎవరో తెలుసా..? బహుజన సమాజ్ ఎన్నికల ప్రస్థానం..

Crime News: చదువుకునేందుకు బ్రిటన్ వెళ్లాడు.. పాడు పని చేయాలనుకున్నాడు.. చివరికి..