Vande Bharat: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. తెలుగు రాష్ట్రాల వందే భారత్‌ రైలు షెడ్యూల్‌లో మార్పులు.

|

Feb 18, 2023 | 11:41 AM

రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక. వందే భారత్‌ రైలు షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారికంగా ప్రకటించింది. సికింద్రాబాద్‌ - విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్‌ రైలు సమయాల్లో మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. శనివారం రోజు రైల్వే షెడ్యూల్‌లో మార్పు చేసినట్లు...

Vande Bharat: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. తెలుగు రాష్ట్రాల వందే భారత్‌ రైలు షెడ్యూల్‌లో మార్పులు.
Vande Bharat Express
Follow us on

రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక. వందే భారత్‌ రైలు షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారికంగా ప్రకటించింది. సికింద్రాబాద్‌ – విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్‌ రైలు సమయాల్లో మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. శనివారం రోజు రైల్వే షెడ్యూల్‌లో మార్పు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్‌ – విశాఖపట్నంల మధ్య నడిచే 2084 నెంబర్‌ ట్రైన్‌ సికింద్రబాద్‌ నుంచి 15.00 గంటలకు బయలుదేరాల్సిన రైలు 16-02-2023 రోజున 16.15 గంటలకు బయలు దేరనుంది.

దాదాపు గంటన్నర ఆలస్యంగా బయలుదేరనుంది. విశాఖ నుంచి బయలు దేరిన రైలు ఆలస్యంగా గమ్యాన్ని చేరుకోవడం కారణంగానే రైలు ఆలస్యమవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించి ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్లాన్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉంటే వందే భారత్‌ రైలు షెడ్యూల్‌లో మార్పు చేయడం ఇదే తొలిసారి కాదు. గురువారం రోజు కూడా ఇలాగే సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరే రైలు సమయాల్లో మార్పులు చేసిన విషయం తెలిసిందే.

గురువారం సికింద్రాబాద్‌ నుంచి బయలు దేరిన వందే భారత్‌ రైలు ఏకంగా రెండు గంటలు ఆలస్యంగా బయలు దేరింది. ఇదిలా ఉంటే వందే భారత్‌ రైలుకు ప్రయాణికుల నుంచి ఆదరణ భారీగా లభిస్తోంది. అత్యధిక ఆక్యూపెన్సీతో రైళ్లు నడుస్తున్నట్లు ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..