Telangana: అమానుషం.. కోతులను చంపి కాల్చుకుని తిన్న యాచకులు

|

Dec 13, 2023 | 5:11 PM

తెలంగాణలోని నిర్మల్‌ జిల్లాలోని చింతల్‌బోరి గ్రామంలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. ఆరుగురు యాచకులు కోతులను చంపి, వాటి మాంసాన్ని వండుకుని తిన్నారు. గమనించిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాచకుల్లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారు పరారయ్యారు. వివరాల్లోకెళ్తే.. భైంసా మండలం చింతల్‌బోరిలో గత మూడు రోజులుగా ఆరుగురు భిక్షాటన చేస్తున్నారు. మంగళవారం రాత్రి గ్రామంలో సంచరిస్తున్న నాలుగు కోతులను చంపి..

Telangana: అమానుషం.. కోతులను చంపి కాల్చుకుని తిన్న యాచకులు
Monkey
Follow us on

నిర్మల్‌, డిసెంబర్‌ 13: తెలంగాణలోని నిర్మల్‌ జిల్లాలోని చింతల్‌బోరి గ్రామంలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. ఆరుగురు యాచకులు కోతులను చంపి, వాటి మాంసాన్ని వండుకుని తిన్నారు. గమనించిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాచకుల్లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారు పరారయ్యారు. వివరాల్లోకెళ్తే.. భైంసా మండలం చింతల్‌బోరిలో గత మూడు రోజులుగా ఆరుగురు భిక్షాటన చేస్తున్నారు. మంగళవారం రాత్రి గ్రామంలో సంచరిస్తున్న నాలుగు కోతులను చంపి వండుకుని తినాలని ప్లాన్‌ వేశారు. కోతి మాంసాన్ని కాలుస్తున్న సమయంలో ఇద్దరు యాచకుల మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన ఓ వ్యక్తి ఈ విషయాన్ని గ్రామంలోని ప్రజలకు చెబుతానని బెదిరించాడు. అనంతరం నిజంగానే.. అతను గ్రామంలోకి వెళ్లి కోతులను చంపి తింటున్నట్లు సమాచారం ఇచ్చాడు. వెంటనే గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తులను చూసిన నలుగురు బిచ్చగాళ్లు పారిపోయారు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కోతులను తామే చంపినట్లు అంగీకరించారు. అనంతరం గ్రామస్తుల కాళ్లపై పడి తమ తప్పుకు చింతిస్తున్నామని, క్షమించమని వేడుకున్నారు.

ఘటనా స్థలంలో కోతుల మృతదేహాలు లభ్యం

ప్రజలు సంఘటనా స్థలానికి వచ్చి తనిఖీ చేయగా నాలుగు కోతులను యాచకులు చంపి వండినట్లు గుర్తించారు. కోతుల చేతులు, కాళ్లు, తలలు కనిపించాయి. ఇది చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. హనుమంతుని అవతారంగా పూజించే కోతులను చంపి తింటారా అంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. తమ తప్పుకు క్షమాపణలు కోరారు. అనంతరం గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే పట్టుబడిన ఇద్దరు యాచకులను అదుపులోకి తీసుకున్నారు.

మరో ఘటన.. 38 కోతులకు విషం పెట్టిన దుండగులు

ఆహారం వెతుక్కుంటూ వచ్చిన 38 కోతులను కనికరం లేకుండా విషం పెట్టి చంపిన అత్యంత అమానవీయ ఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లా బేలూరు తాలూకాలో 2021 జులైలో చోటుచేసుకుంది. మూగ జీవాలను మూకుమ్మడిగా వధించారు. రోడ్డుపై పడి ఉన్న పెద్ద సంచిని బయటకు తీయగా అందులో 60కి పైగా కోతులు అపస్మారక స్థితిలో కనిపించాయి. ఇందులో 38 కోతులు చనిపోయాయి. 15కు పైగా కోతులు చావుబతుకులతో పోరాడుతు కనిపించాయి. గ్రామస్థులు అటవీశాఖ, పోలీసులు, పశువైద్యులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. కోతులకు నీరు, ఆహారం ఇచ్చి వాటిని బతికించే ప్రయత్నం చేసినా.. చాలా కోతులు చనిపోయాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.