Bhatti Vikramarka: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ప్రజాభవన్ కేటాయింపు..

రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజా భవన్‌ను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

Bhatti Vikramarka: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ప్రజాభవన్ కేటాయింపు..
Bhatti Vikramarka
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 13, 2023 | 5:03 PM

రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజా భవన్‌ను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, గురువారం మధ్యాహ్నం భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా ప్రజా భవన్‌లోకి అడుగుపెట్టనున్నారు..

కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు.. జ్యోతిబా ఫూలే ప్రజాభవన్.. ప్రగతి భవన్‌ గా ఉండేది.. మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారిక నివాసం, క్యాంపు కార్యాలయంగా ఉండేది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రగతి భవన్ దగ్గర కంచెను తొలగించడంతోపాటు.. పేరును మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రగతి భవన్ పేరును జ్యోతిబా ఫూలే ప్రజాభవన్ గా నామకరణం చేశారు. అక్కడే ప్రజావాణి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో జ్యోతిబాపూలే ప్రజాభవన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుకు కేటాయించారు.

అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక నివాసానికి, క్యాంపు కార్యాలయానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు.. రేవంత్ రెడ్డి తన నివాసం, క్యాంపు కార్యాలయానికి సంబంధించి ఇటీవల జూబ్లీహిల్స్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డిఐ) ప్రాంగణాన్ని పరిశీలించారు. సిఎం క్యాంపు కార్యాలయంగా మార్చడానికి అవసరమైన మార్పులపై చర్చించినట్లు సమాచారం..

క్యాంపు కార్యాలయానికి, నివాసానికి ఒకే స్థలాన్ని కేటాయించే సంప్రదాయాన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటివరకు కొనసాగిస్తూ వస్తుండగా.. రేవంత్ రెడ్డి మాత్రం దానికి ప్రత్యామ్నాయంగా వేరే భవనాన్ని పరిశీలిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..