Secunderabad Station Violence: అసలు సంగతి తెలిసింది..! సాయి ఢిపెన్స్‌ అకాడమీలో కొనసాగుతున్న సిట్ అధికారుల తనిఖీలు

|

Jun 20, 2022 | 3:18 PM

సికింద్రాబాద్ అల్లర్ల కేసులో విచారణ ఫుల్‌ స్వింగ్‌లో ఉంది. రైల్వేస్టేషన్‌ విధ్వంసం కేసును సిట్‌కు బదిలీ చేశారు రైల్వే పోలీసులు. ఈ అల్లర్ల వెనుక ఆర్మీ కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తోంది. వారే అభ్యర్థులను రెచ్చగొచ్చారన్న ఆరోపణలు వస్తున్నాయి.

Secunderabad Station Violence: అసలు సంగతి తెలిసింది..! సాయి ఢిపెన్స్‌ అకాడమీలో కొనసాగుతున్న సిట్ అధికారుల తనిఖీలు
A representative image
Follow us on

సికింద్రాబాద్‌ స్టేషన్‌లో(Secunderabad Station) అల్లర్ల కేసులో విచారణ ముమ్మరం చేశారు రైల్వే పోలీసులు. కేసును సిట్‌కు బదిలీ చేశారు రైల్వే పోలీసులు. ఘనటలో 15 కోచింగ్‌ సెంటర్ల పాత్ర ఉన్నట్టు అనుమానిస్తున్న పోలీసులు.. కోచింగ్‌ సెంటర్ల పాత్రపై పోలీసుల ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు కోచింగ్‌ సెంటర్లపై గురిపెట్టారు. కోచింగ్ సెంటర్ల యజమాను వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి గుంటూరు చేరుకున్నాయి ఐటీ, ఇంటెలిజెన్స్‌ వర్గాలు. గుంటూరు సాయి ఢిపెన్స్‌ అకాడమీలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. మొత్తం 15 కోచింగ్‌ సెంటర్ల పాత్రపై విచారణ జరుపుతున్నారు. ఈ విషయంలో ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఈ కోచింగ్‌ సెంటర్లు నడుపుతున్నదెవరు? రెచ్చగొట్టిందెవరు అనే విషయంలో దర్యాప్తు చేస్తున్నారు.

అలర్ల కేసులో 8 వాట్సాప్‌ గ్రూప్‌లను గుర్తించారు. ఈ వాట్సాప్‌ గ్రూపుల్లో ఎవరెవరు ఉన్నారు? ఏం మెసేజ్‌లు పెట్టారన్నదానిపై ఆరా తీస్తున్నారు. రైల్వేస్టేషన్‌ను ముట్టడించి విధ్వంసం సృష్టించాలని వాట్సాప్‌లో మెసేజ్‌లు వచ్చినట్లు గుర్తించారు.

అయితే మొత్తం 15 కోచింగ్‌ సెంటర్ల పాత్రపై విచారణ జరుపుతున్నారు. ఈ విషయంలో ఆధారాలు సేకరించేపనిలో బిజీగా ఉన్నారు. ఈ కోచింగ్‌ సెంటర్లు నడుపుతున్నదెవరు? రెచ్చగొట్టిందెవరు అనే విషయంలో దర్యాప్తు జరుగుతోంది. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలపై వీరు ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా.. హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరులోని కోచింగ్ సెంటర్ల యజమాను వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసంలో గాయపడిన ఆర్మీ అభ్యర్ధులు మరి కొద్ది సేపట్లోనే డిశ్చార్జ్ కానున్నారు. తొమ్మిది మంది ఆర్మీ అభ్యర్ధులను డిశ్చార్జ్ చేసిన అనంతరం అరెస్ట్ చేయనున్న GRP పోలీసులు. ఇప్పటికే ఈ కేసును హైదరాబాద్ సిట్ కు అప్పగించిన నేపథ్యంలో.. వీరందరినీ సిట్‌ కస్టడీలోకి తీసుకోనుంది. మరో నలుగురు ఇంకా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ వార్తల కోసం..