AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్‌ దూకుడు.. హైదరాబాద్, విశాఖలో ఏకకాలంలో సోదాలు!

ఆంధ్రప్రదేశ్ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్‌ దర్యాప్తు వేగవంతం చేసింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు అధికారులు. గ్రీన్‌టెల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కార్యాలయాల్లో తనిఖీలు చేసిన అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు నర్రెడ్డి సునీల్‌ రెడ్డికి చెందిన 10 కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు సిట్ అధికారులు.

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్‌ దూకుడు.. హైదరాబాద్, విశాఖలో ఏకకాలంలో సోదాలు!
Ap Liquor Scam Case
Balaraju Goud
|

Updated on: Sep 11, 2025 | 4:14 PM

Share

ఆంధ్రప్రదేశ్ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్‌ దర్యాప్తు వేగవంతం చేసింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు అధికారులు. గ్రీన్‌టెల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కార్యాలయాల్లో తనిఖీలు చేసిన అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు నర్రెడ్డి సునీల్‌ రెడ్డికి చెందిన 10 కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు సిట్ అధికారులు. బంజారాహిల్స్‌, సాగర్‌ సొసైటీ, రాజేంద్రనగర్‌, ఖైరతాబాద్‌, కమలాపురిలోని కార్యాలయాలపై ఏకకాలంలో్ దాడులు చేశారు.

హైదరాబాద్, విశాఖలోని సునీల్‌రెడ్డి కార్యాలయాల్లో సిట్‌ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్‌లో ఉన్న 8 కంపెనీలకు నాలుగు కార్యాలయాలు, విశాఖలో ఉన్న రెండు కంపెనీలకు ఒక కార్యాలయం ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. LLP, ఫౌండేషన్ హోదాల్లో సునీల్‌రెడ్డి కార్యకలాపాలు రన్ చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.

మరోవైపు ఈ కేసులో పలువురికి బెయిల్ లభించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ్‌ రెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు బెయిల్‌ విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఇదే కేసులో అరెస్టయిన ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటువేసేందుకు బెయిల్ మంజూరు చేసింది. సెప్టెంబర్ 11న తిరిగి సరెండర్‌ కావాలని ఆదేశించింది.

ఏపీ లిక్కర్ కేసులో సిట్ అధికారులు బాలాజీ గోవిందప్పను మే 13న, ధనుంజయ్, కృష్ణమోహన్ రెడ్డిని మే 16న అరెస్ట్ చేశారు. ఈ కేసులో సీఎంఓ మాజీ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి ఏ31గా, మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఏ32గా, బాలాజీ గోవిందప్ప ఏ33గా ఉన్నారు. మిథున్‌ రెడ్డి జులై 19, 2025న విజయవాడలో సిట్ విచారణ కోసం హాజరైన తర్వాత అరెస్టయ్యారు. ఆయనను ఏసీబీ కోర్టు రాజమండ్రి సెంట్రల్ జైలుకు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. సిట్ రిమాండ్ రిపోర్టులో మిథున్ రెడ్డిని ప్రధాన కుట్రదారుడుగా పేర్కొంది. ఆయన ఎక్సైజ్ పాలసీలో మార్పులు, డిస్టిలరీల నుంచి లంచాల సేకరణలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపించింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..