AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో తొలి జీబీఎస్‌ మరణం.. సిద్దిపేట జిల్లాకు చెందిన 25 ఏళ్ల వివాహిత మృతి

ప్రస్తుతం దేశంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు జీబీఎస్‌. ఇది ఒక నరాల వ్యాధి. ఈ వ్యాధిని మొదటగా మహారాష్ట్రలో గుర్తించారు. ఈ వ్యాధితో తెలంగాణలో తొలి మరణం నమోదు అయింది. కరోనాలా ఇది అంటువ్యాధి కాదు. ఆందోళన చెందాల్సిన పనిలేదు కానీ అప్రమత్తంగా వుండాలి. డాక్టర్లు చెప్పినట్టుగా వైరస్‌ లక్షణాలు కన్పిస్తే వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాలి.

Telangana: తెలంగాణలో తొలి జీబీఎస్‌ మరణం.. సిద్దిపేట జిల్లాకు చెందిన 25 ఏళ్ల వివాహిత మృతి
Guillain Barre Syndome
Ram Naramaneni
|

Updated on: Feb 09, 2025 | 8:37 PM

Share

తెలంగాణలో తొలి జీబీఎస్‌ మరణం నమోదు అయింది. సిద్దిపేట జిల్లా సీతారాంపల్లికి చెందిన 25 ఏళ్ల మహిళ..ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. ఆమెకు ఐదేళ్లలోపు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమెకు ఇటీవల కుమార్తె జన్మించింది. కుమార్తె జన్మించిన తర్వాత నెల రోజుల కిందట నరాల నొప్పులతో అనారోగ్యం బారిన పడింది. దీంతో కుటుంబ సభ్యులు సిద్దిపేట, హైదరాబాద్‌లోని నిమ్స్‌, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. ఇలా ఆమె వైద్యానికి లక్షలు ఖర్చు చేశారు. అయినా ఫలితం లేకుండాపోయింది. చివరికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయారు.

మహారాష్ట్రలోని పుణెలో జీబీఎస్‌ కారణంగా పలువురు మృతి చెందారు. ఇప్పటికే చాలా మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ వ్యాధితో మరణం సంభవించడం ఇదే మొదటిదని వైద్యులు తెలిపారు. జీబీఎస్ వ్యాధి సోకిన వారిలో శరీరమంతా తిమ్మిరిగా అనిపిస్తుందని.. తీవ్రమైన జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు. ఈ జీబీఎస్ వ్యాధి గురించి ప్రజలు ఆందోళకు గురికావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. బాధితుల్లో కొన్ని వారాల పాటు వ్యాధి లక్షణాలు ఉంటాయి. చికిత్సతో బాధితులకు నయం చేయొచ్చని అంటున్నారు.

బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్‌ కారణంగా బలహీన రోగ నిరోధక శక్తి కలిగిఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారినపడే అవకాశాలు ఉంటాయని వైద్యులు వెల్లడించారు. శరీరానికి సోకిన ఇన్ఫెక్షన్‌కు ప్రతిస్పందించే రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున నరాలపై దాడి చేసే అరుదైన పరిస్థితి ఇది అని వైద్యులు తెలిపారు.ముఖ్యంగా నరాలపైనే జీబీఎస్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కలుషిత ఆహారం, నీటి ద్వారా బ్యాక్టీరియా సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే, ప్రజలు భయాందోళనకు గురికావొద్దని, జీబీఎస్‌ అంటువ్యాధి కాదని, చికిత్సతో నయం చేయొచ్చని వైద్యులు వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
వశీకరణం అందుకే చేస్తారు.? కానీ దాని మంత్రాన్ని ఇలా వాడితే.!
వశీకరణం అందుకే చేస్తారు.? కానీ దాని మంత్రాన్ని ఇలా వాడితే.!
ఈ పండ్లు ఎక్క‌డైనా క‌నిపించాయా..? వెంటనే తెచ్చుకుని తినేయండి..!
ఈ పండ్లు ఎక్క‌డైనా క‌నిపించాయా..? వెంటనే తెచ్చుకుని తినేయండి..!
బాలకృష్ణతో ఆ హీరోయిన్ ఒక్క సినిమాలోనూ నటించలేదు..
బాలకృష్ణతో ఆ హీరోయిన్ ఒక్క సినిమాలోనూ నటించలేదు..
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఏంటో తెలుసా..?
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఏంటో తెలుసా..?
పేదవాడి బాదం.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆరోగ్యానికి ఢోకా లేదు..!
పేదవాడి బాదం.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆరోగ్యానికి ఢోకా లేదు..!
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి