AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: తలను ఛిద్రం చేసి.. మొండెం మర్మాంగాన్ని బియ్యం సంచిలో కుక్కి.. నవీన్ హత్య కేసులో గగుర్పొడిచే వాస్తవాలు..

హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం కలిగించిన నవీన్ హత్య కేసు పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన ప్రేమకు అడ్డొస్తున్నాడని భావించిన...

Hyderabad: తలను ఛిద్రం చేసి.. మొండెం మర్మాంగాన్ని బియ్యం సంచిలో కుక్కి.. నవీన్ హత్య కేసులో గగుర్పొడిచే వాస్తవాలు..
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 28, 2023 | 2:49 PM

హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం కలిగించిన నవీన్ హత్య కేసు పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన ప్రేమకు అడ్డొస్తున్నాడని భావించిన హరిహరకృష్ణ ఈ నెల 17న నవీన్ ను దారుణంగా హత్య చేశాడు. మృతుడి తల, చేతివేళ్లు, మర్మాంగాన్ని శరీరం నుంచి వేరు చేశాడు. వాటిని సంచిలో మూటగట్టి బ్రాహ్మణపల్లి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో పడేశాడు. హతుడి గుండెను, హతమార్చేందుకు ఉపయోగించిన కత్తిని, సెల్‌ఫోన్‌ను దూరంగా పడేశాడు. కొన్ని రోజుల తర్వాత తల, చేతివేళ్లు, మర్మాంగాన్ని విసిరేసిన చోట నుంచి తీసుకువచ్చి.. బియ్యం సంచిలో మొండెంతో కలిపి కుక్కేశాడు. మిగతా శరీర భాగాలను దహనం చేశాడు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. కాగా.. హరిహరకృష్ణ రెండో తరగతి చదువుతున్న సమయంలో అతని తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. సోదరుడు రైలు ప్రమాదంలో మృతి చెందాడు. హరిహర ముసారాంబాగ్‌లో ఉంటూ ఇంటర్‌ చదివాడు. అక్కడే నవీన్‌తో పరిచయమైంది.

నవీన్‌ హత్య కేసులో నిందితుడు హరిహర కృష్ణకు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. తాజాగా రిమాండ్‌ రిపోర్టులో మరిన్ని షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పక్కా ప్లాన్‌ ప్రకారం నవీన్‌ను హత్య చేసినట్లు తేలింది. రెండు నెలల క్రితం షాపింగ్ మాల్లో కత్తి కొని, ఆ కత్తిని తన స్కూటీలో పెట్టుకుని అదును కోసం ఎదురుచూశాడు. ఈ క్రమంలో పార్టీ పేరుతో జవవరి 16న హత్యకు కుట్ర పన్నాడు. అది ఫలించక పోవడంతో ఫిబ్రవరి 17న హత్యను అమలు చేశాడు.

రాత్రి 9 గంటలకు పెద్దంబర్‌పేట్‌ తిరుమల వైన్స్‌ వద్ద నవీన్‌, హరిహర కృష్ణ మద్యం సేవించారు. అనంతరం ఎల్బీనగర్‌, నాగోల్‌, ముసారంబాగ్‌, సైదాబాద్‌, చైతన్యపురి, కొత్తపేట ప్రాంతాల్లో నవీన్‌తో కలిసి ద్విచక్ర వాహనంలో తిరిగారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి నవీన్ ను తీసుకుని బ్రహ్మణపల్లికి వెళ్లాడు. అక్కడ రాత్రి 12 గంటల ప్రాంతంలో యువతి ప్రేమ వ్యవహారంలో పరస్పర వాగ్వాదం జరిగింది. ఈక్రమంలో కోపోద్రిక్తుడైన హరి తొలుత గొంతు నులిమి నవీన్‌ను హత్య చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..