Telangana: TSPSC కేసులో ఇది కనీవినీ ఎరుగని సంచలనం

టీఎస్‌పీఎస్సీ క్వశ్చన్ పేపర్​ లీకేజీ వ్యవహారంలో విద్యుత్ శాఖ డీఈ రమేష్‌ లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా....

Telangana: TSPSC కేసులో ఇది కనీవినీ ఎరుగని సంచలనం
TSPSC
Follow us

|

Updated on: Jun 04, 2023 | 5:54 PM

TSPSC కేసులో ఇది కనీవినీ ఎరుగని సంచలనం. అర్జున్‌ మూవీలో కాపీయింగ్‌ సీన్‌ని యాజ్‌టీజ్‌గా కాపీ కొట్టాడు DE రమేష్‌. ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ జాకెట్‌ తయారు చేయించి మరీ హైటెక్‌ కాపీయింగ్‌కు తెర లేపాడు ఈ ప్రబుద్ధుడు. మొత్తం 15 కోట్ల రూపాయలకు డీల్‌ కుదుర్చుకున్నాడు. TSPSC టెక్నీషియన్ సురేష్ ద్వారా రమేష్‌కు AE పేపర్‌ చేరింది. అతగాడి ద్వారా మరో 30మందికి చేరింది ఈ పేపర్‌.

TSPSC లో తీగ లాగితే DE రమేష్‌ లీక్స్ బయటపడుతూనే ఉన్నాయి. ఈ కేసులో A-50 ముద్దాయిగా ఉన్న రమేష్‌ లీలలు చూసి అధికారులే విస్తుపోతున్నారు. AEE, DAO ఎగ్జామ్స్‌లో ఇన్విజిలేటర్స్‌ సాయంతో హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌కి తెర లేపాడు రమేష్‌. దీంతో అతగాడి ద్వారా లబ్ధి పొందిన అభ్యర్థుల జాబితాను సిట్‌ తయారు చేస్తోంది. మాస్‌ కాపీయింగ్‌కి పాల్పడ్డ పలువురిని ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. రమేష్ ద్వారా మాస్ కాపీయింగ్ చేసిన మరో నలుగురు నిందితులను కస్టడీకి ఇచ్చింది కోర్టు.

TSPSC నోటిఫికేషన్‌ విడుదలైన తరువాత రమేష్‌తో పాటు మరో ఎనిమిదిమంది మాస్‌ కాపీయింగ్‌కు స్కెచ్‌ వేశారు. దీనికి అవసరమైన మైక్రో రిసీవర్స్‌, మైక్రో ఇయర్ బగ్స్‌ ఆన్‌లైన్‌లో కొన్నారు. మాస్‌ కాపీయింగ్‌ కోసం సేకరించిన డివైజెస్‌తో పలుసార్లు డెమో నిర్వహించారు. అంతా ఓకే అనుకున్నాక.. రమేష్‌ అతని బంధువు పూల రవికిశోర్‌…అభ్యర్ధుల కోసం‌ సెర్చ్‌ చేశారు. సిటీలోని కోచింగ్ సెంటర్స్‌లో కోచింగ్‌ తీసుకుంటున్న కేండిడేట్స్‌తో కాంటాక్ట్‌ అయ్యారు. ఇందులో AEE, DAO పరీక్షలు రాస్తున్న అభ్యర్ధులను గుర్తించారు. వాళ్లతో మాట్లాడి డీల్‌ సెట్‌ చేసుకుని కోట్ల రూపాయలు దండుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎండాకాలం మీ పిల్లలకు ఈ యానిమేషన్ సినిమాలు బెస్ట్..
ఎండాకాలం మీ పిల్లలకు ఈ యానిమేషన్ సినిమాలు బెస్ట్..
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
తరచూ జలుబు చేస్తుందా..? వామ్మో.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
తరచూ జలుబు చేస్తుందా..? వామ్మో.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
భర్తపై ఆమెకు ఎంత ప్రేమో..! పతి దేవుడికి ఏకంగా గుడి కట్టేసింది..
భర్తపై ఆమెకు ఎంత ప్రేమో..! పతి దేవుడికి ఏకంగా గుడి కట్టేసింది..
మీ ఊహకు దృశ్యరూపం.. వాట్సాప్‌ ఏఐతో ఇది సాధ్యం.
మీ ఊహకు దృశ్యరూపం.. వాట్సాప్‌ ఏఐతో ఇది సాధ్యం.
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు వైయస్సార్‌ వారసులా?.. జగన్ ఫైర్
శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు వైయస్సార్‌ వారసులా?.. జగన్ ఫైర్
సమ్మర్‌లో తలనొప్పి వేధిస్తుందా.? ఇవి తింటే ఇట్టే చెక్‌ పెట్టొచ్చు
సమ్మర్‌లో తలనొప్పి వేధిస్తుందా.? ఇవి తింటే ఇట్టే చెక్‌ పెట్టొచ్చు
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనీ.. ఏడుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనీ.. ఏడుగురు విద్యార్ధుల ఆత్మహత్య!