Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motkupalli Narasimhulu: బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధమైన మోత్కుపల్లి.. కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం

Telangana Assembly polls: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పార్టీని విడగా.. మరో సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు కూడా పార్టీ వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మోత్కుపల్లి నరసింహులు.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ పై సీఎం కేసీఆర్ స్పందించాలంటూ మోత్కుపల్లి నరసింహులు ప్రస్థావించడం చర్చనీయంశంగా మారింది. మరోవైపు మోత్కుపల్లి రాకను స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆహ్వానిస్తున్నారట.

Motkupalli Narasimhulu: బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధమైన మోత్కుపల్లి.. కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం
Motkupalli Narasimhulu
Follow us
M Revan Reddy

| Edited By: Sanjay Kasula

Updated on: Sep 25, 2023 | 11:37 AM

నల్గొండ, సెప్టెంబర్ 25:  తెలంగాణలో రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ వస్తుందని ఊహగాణాల నేపథ్యంలో బీఆర్ఎస్‌లో టికెట్ దక్కని నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పార్టీని విడగా.. మరో సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు కూడా పార్టీ వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మోత్కుపల్లి నరసింహులు.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ పై సీఎం కేసీఆర్ స్పందించాలంటూ మోత్కుపల్లి నరసింహులు ప్రస్థావించడం చర్చనీయంశంగా మారింది.

సీఎం కేసీఆర్‌ను నమ్మి మోసపోయానని చేసిన కామెంట్స్ నర్సింహులు పార్టీ విడబోతున్నారని సంకేతాలు స్పష్టం చేస్తున్నాయి. ఆలేరు బీఆర్ఎస్ సీటు ఆశించి బంగపడ్డ మోత్కుపల్లి నర్సింహులు గత కొంత కాలంగా పార్టీలో క్రియా శీలకంగా కనిపించకపోవడం.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై సానుకూలంగా మాట్లాడడం.. ఇవ్వన్నీ పార్టీని వీడెందుకే అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ వ్యూహం కూడా ఇదేనట..

బీఆర్ఎస్‌ను ఢీకొట్టేందుకు వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు అసమ్మతి వాదులను పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ వ్యూహంగా ఉందట. ఇందులో భాగంగానే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులును సైతం కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు కాంగ్రెస్ నేతలు ఆసక్తి చూపుతున్నారు.

సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రారంభంలో తన ఆలోచనలు తీసుకున్న తర్వాత, ప్రాధాన్యం ఇవ్వకపోవడం, కనీసం కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని మోత్కుపల్లి చేసిన కామెంట్స్ తో.. తమ పార్టీ వైపుకు ఆయనను తిప్పుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారని.. ఇప్పటికే మోత్కుపల్లితో టచ్‌లోకి వెళ్లారట. మోత్కుపల్లిని పార్టీలో చేర్చుకొని ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గమైన తుంగతుర్తి నుంచి బరిలోకి దించాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలు యోచిస్తున్నారట. టీడీపీలో సుధీర్ఘ కాలం రేవంత్ తో కలిసి నర్సింహులు పనిచేశారు.

సానుకూల వ్యాఖ్యలు చేయడం..

ఆ సమయంలో రేవంత్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించిన మోత్కుపల్లి నరసింహులు.. ప్రస్తుతం రేవంత్ రెడ్డి నా తమ్ముడే అంటూ సానుకూల వ్యాఖ్యలు చేయడం కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మోత్కుపల్లి వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ కీలకనేతగా ఉన్న కొప్పుల రాజు.. మోత్కుపల్లితో సంప్రదింపులు కూడా జరిపారట. మరోవైపు మోత్కుపల్లి రాకను స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆహ్వానిస్తున్నారట. దీంతో మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారట.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం