కలియుగ క్యాలెండర్.. మీకలియుగ క్యాలెండర్.. మీరు ఎప్పుడైనా చూశారా..? 4 లక్షల సంవత్సరాల పంచాంగంరు ఎప్పుడైనా చూశారా..? చూసే విధానం ఎలా ఉంటుందంటే..

| Edited By: Jyothi Gadda

Apr 05, 2024 | 11:42 AM

ఈ కలియుగ క్యాలెండర్ ఈ ఏడాది (2024)లో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని మల్లేశం చెబుతున్నారు. వినూత్నంగా కలియుగ కేలండర్ ను రూపొందించిన మల్లేశం ను పలు స్వచ్ఛంద సంస్థలు సత్కరించి పురస్కారాలు అందజేశాయి. అయితే మల్లేశం రూపొందించిన ఈ కలియుగ క్యాలెండర్ మాత్రం సామాన్యులకు అర్థం కావడం కొంచెం కష్టంగానే ఉంది.

కలియుగ క్యాలెండర్.. మీకలియుగ క్యాలెండర్.. మీరు ఎప్పుడైనా చూశారా..? 4 లక్షల సంవత్సరాల పంచాంగంరు ఎప్పుడైనా చూశారా..? చూసే విధానం ఎలా ఉంటుందంటే..
Calendar
Follow us on

సాధారణంగా క్యాలెండర్ అంటే ఏడాదికి ఒకసారి ఉంటుంది. ఈ క్యాలెండర్లు పలు భాషల్లో కూడా ఉంటాయి. ప్రతి ఇంట్లో జనవరి ఒకటో తేదీన క్యాలెండర్ ను మార్చి కొత్త క్యాలెండర్ ను పెట్టుకుంటాం. ఈ క్యాలెండర్లలో తిధులు, ముహూర్తాలు, ప్రభుత్వ సెలవులు ఉంటాయి. మనం ఇప్పటివరకు వంద సంవత్సరాలకు సంబంధించిన శతాబ్ది పంచాంగాలు, నమూనా క్యాలెండర్లను కూడా చూశాం. కానీ 4.50లక్షల ఏళ్ల క్యాలెండర్ ను మీరు ఎప్పుడైనా చూశారా..? ఈ కలియుగ క్యాలెండర్ గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం..

సిరిపురం గ్రామానికి చెందిన పున్న మల్లేశం.. నిరుపేద కుటుంబంలో జన్మించి కష్టపడి చదువుకున్నాడు. జీవితంలో ఏదైనా సాధించాలనే తపనతో కష్టపడ్డాడు. చిన్నప్పటి నుంచి తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలనే కోరిక ఉండేది. జీవనోపాధి కోసం మెడికల్ షాప్ ను నిర్వహిస్తూనే మరోవైపు మూడేళ్లపాటు కష్టపడి 2020వ సంవత్సరంలో ఐరిస్ క్యాలెండర్ ను రూపొందించాడు. ఈ ఐరిస్ క్యాక్యాలెండర్ ద్వారా క్రీ.శ. 1500 సంవత్సరం నుంచి 2600 సంవత్సరం వరకు ఉపయోగించే విధంగా 1,200 ఏళ్ల ఐరిస్ క్యాలెండర్ ను రూపొందించాడు. మల్లేశం ప్రతిభను గుర్తించిన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఫిబ్రవరిలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం కల్పించింది.

ఇవి కూడా చదవండి

కలియుగ క్యాలెండర్…

మల్లేశం రచయిత, గాయకుడిగా కొనసాగుతూనే పంచాంగం జ్యోతిష్యం, సంఖ్యా శాస్త్రం, వాస్తు శాస్త్రంపై మంచి పట్టు సాధించాడు. ఐరిస్ క్యాలెండర్ తయారీతో ఆగకుండా మల్లేశం తన ఆలోచనలు, ప్రయత్నాలకు మరింత పదును పెట్టాడు. అనేక ప్రయోగాల తర్వాత వృత్తాకార గోడ కలియుగ కాలాన్ని సూచించే క్యాలెండర్ ను రూపొందించాడు. 4.50లక్షల ఏళ్ల క్యాలెండర్ రూపొందించి 2024వ సంవత్సరానికి సంబంధించి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థానం సంపాదించాడు. ఈ క్యాలెండర్ లో తేది, వారం, నెల సంవత్సరంతోపాటు తెలుగు సంవత్సరాలు, తిథి, వార, నక్షత్ర, రాహు,గుళిక, యమగండం, దుర్ముహూర్తం, పండుగలు, రాశిచక్రాలు వంటి అంశాలను పొందుపరిచాడు. ఈ క్యాలెండర్ ను తేది, తిధులు ముహూర్తాలు అంటే అంశాలను సులభంగా చూసేందుకు ఫ్లై వుడ్ షీట్, అద్దాలతో వృత్తాకారంలో తయారు చేశాడు.

తేదీ క్యాలెండర్ ను చూసే విధానం..

ప్లైవుడ్ బోర్డుపై రెండు వృత్తాకార అద్దాలను ఏర్పాటు చేశాడు. పై అద్దంలో సంవత్సరాన్ని తెలిపే అంకెలు ( క్రీ.పూ నుంచి క్రీ.శవరకు) 1200 సంవత్సరాలను పొందుపరిచాడు. రెండవ అద్దంపై నున్న పైవరుసలో నెలలు, కింది వరుసలో నెలకు సరిపడా 31 అంకెలను ముద్రించారు. లీప్ సంవత్సరానికి చెందిన అంకెలను పసుపురంగులో ముద్రించారు. అద్దాలను సరిచేసుకోవడం ద్వారా తేది, వారం, సంవత్సరం తెలుసుకోవచ్చు.

ఉదాహారణకు.. 5 ఏప్రిల్, 2024కు సంబంధించిన వారం తెలుసు కోవాలంటే పై అద్దంలో 2024 సంవత్సరం.. కింద ఉన్న అద్దంలో ఏప్రిల్ నెలను అడ్జస్ట్ చేస్తే కింది వరుసలో ఆ నెలకు సంబంధించిన తేదీతో కూడిన వారాలు వస్తాయి. 2024 ఏప్రిల్ 5 శుక్రవారంగా వస్తుంది. అయితే ఈ విధానంలో తిథి, నక్షత్రాలకు సంబంధించిన సమాచారం రాకపోవడంతో మల్లేశం శ్రమించాడు. ఈ క్యాలెండర్ ను మరింత అభివృద్ధి చేసి పంచాంగంతో కూడిన క్యాలెండర్ ను రూపొందించాడు. దీనికోసం 150 క్యాలెండర్లను తయారు చేశాడు. ఒక్కో క్యాలెండర్ లో 3వేల సంవత్సరాలకు సంబంధించిన తిథి, వార, నక్షత్ర, రాహుకాలం, యమగండం, గుళిక కాలం, పండుగలు, రాశిచక్రం తెలుగు సంవత్సరాలు, దుర్ముహూర్తం మొదలైన అంశాలను సులభంగా చూసే విధంగా రూపొందించాడు.

తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం..

లోకంతో పాటు తాను కూడా ఒకడు కాకుండా తానకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం తొలుత ఐరిష్ క్యాలెండర్ ను రూపొందించాలని మల్లేశం చెబుతున్నాడు. ఈ ఐరిష్ క్యాలెండర్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ చోటు దక్కడంతో మరింత ఆత్మ విశ్వాసం పెరిగిందని అన్నారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ఐరిస్ క్యాలెండర్ మరింత అభివృద్ధి చేసి కలియుగ క్యాలెండర్, పంచాంగం రూపొందించానని మల్లేశం చెప్పారు. ఈ కలియుగ క్యాలెండర్ ఈ ఏడాది (2024)లో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని మల్లేశం చెబుతున్నారు. వినూత్నంగా కలియుగ కేలండర్ ను రూపొందించిన మల్లేశం ను పలు స్వచ్ఛంద సంస్థలు సత్కరించి పురస్కారాలు అందజేశాయి. అయితే మల్లేశం రూపొందించిన ఈ కలియుగ క్యాలెండర్ మాత్రం సామాన్యులకు అర్థం కావడం కొంచెం కష్టంగానే ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..