Telangana: డెక్కన్ మాల్ కూల్చివేతకు ఆల్ సెట్.. అధునాత టెక్నాలజీతో రేపటి నుంచే..

|

Jan 25, 2023 | 5:05 PM

డెక్కన్ మాల్ బిల్డింగ్‌ కూల్చివేతకు రంగం సిద్ధమైంది. రేపటినుంచి కూల్చివేత ప్రారంభం కానుంది. ఇవాళ ఉదయం జీహెచ్‌ఎంసీ భవనాన్ని కూల్చాలంటూ టెండర్లు పిలిచింది.

Telangana: డెక్కన్ మాల్ కూల్చివేతకు ఆల్ సెట్.. అధునాత టెక్నాలజీతో రేపటి నుంచే..
Deccan Mall
Follow us on

డెక్కన్ మాల్ బిల్డింగ్‌ కూల్చివేతకు రంగం సిద్ధమైంది. రేపటినుంచి కూల్చివేత ప్రారంభం కానుంది. ఇవాళ ఉదయం జీహెచ్‌ఎంసీ భవనాన్ని కూల్చాలంటూ టెండర్లు పిలిచింది. అధునాతన యంత్రాలతో కూల్చాలని.. అలాగే చుట్టుపక్కల బిల్డింగ్‌లకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా కూల్చేయాలని కండీషన్ విధించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చెందిన కంపెనీ టెండర్ దక్కించుకుంది. రేపటి నుంచి కూల్చివేత పనులు ఆ కంపెనీ ప్రారంభించింది. రూ. 41లక్షలకు టెండర్‌ను కంపెనీ దక్కించుకుంది.

లైసెన్స్ తప్పనిసరి..

వరుస అగ్ని ప్రమాదాలతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. బీఆర్కే భవన్‌లో ఉన్నతాధికారులతో మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, తలసాని సమావేశమయ్యారు. పురాతన భవనాలు, అక్రమ నిర్మాణాలు, ఫైర్ సేఫ్టీ నిబంధనలు, అగ్ని ప్రమాదాలకు కారణాలపై ప్రధానంగా చర్చించారు. వరుస అగ్ని ప్రమాదాలతో హైదరాబాద్‌లో వ్యాపారస్తులకు షాకిచ్చారు పోలీసులు. ఇకపై వ్యాపారాలకు పోలీస్‌ లైసెన్స్‌ తప్పనిసరి చేశారు. ట్రేడ్‌, ఫుడ్‌, ఫైర్‌తోపాటు పోలీస్‌ లైసెన్స్‌ కూడా తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. లైసెన్స్‌ తీసుకునేందుకు మార్చి 31 వరకు గడువిచ్చారు.

ఫైర్ సేఫ్టీపై ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది కేసీఆర్‌ సర్కార్‌. అలాగే ఫైర్ సేఫ్టీ చట్టానికి త్వరలోనే సవరణలు చేయబోతోంది. ప్రధానంగా ఫైర్ సేఫ్టీ వింగ్‌లో బిల్డింగ్‌ ఓనర్స్‌ను కూడా చేర్చేలా పాలసీ రూపొందించబోతున్నారు. ఫైర్ సేప్టీ కోసం మంత్రులు కీలక ప్రతిపాదనలు చేశారు. డ్రోన్లు, రోబోటిక్ టెక్నాలజీ వినియోగించాలన్నారు. అధునిక యంత్రాలతో ఫైర్‌ సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు. లేటెస్ట్ టెక్నాలజీ కొనుగోలుకు ప్రతిపాదనలు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..