Amit Shah Hyderabad Tour: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. చేవేళ్ల వేదికగా జరగనున్న ‘విజయ సంకల్ప సభ’లో ఆయనపాల్గొని, ప్రసంగించనున్నారు. అయితే ఢిల్లీలో అత్యవసర సమావేశం ఉన్న నేపథ్యంలో అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో మార్పులు జరిగినట్లు సమాచారం. అంతకముందు ఆర్ఆర్ఆర్ టీమ్‌తో భేటీ కావాలనుకున్న ఆయన.. దాన్ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే తెలంగాణ బీజేపీ నేతలతో జరగవలసి ఉన్న సమావేశం కూడా తాత్కాలికంగా రద్దయింది.
మరోవైపు ఢిల్లీలోని అత్యవసర సమావేశాలు ముగించుకున్న తర్వాతే అమిత్ షా హైదరాబాద్‌కి వస్తారని, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా చేవెళ్ల బహిరంగ సభకు వెళ్తారు. షెడ్యూల్ ప్రకారం అమిత్ షా ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్ రావాల్సి ఉంది. కానీ షెడ్యూల్ మార్పుల కారణంగా ఆయన ఇక్కడకు 5 గంటలకు చేరుకుని నేరుగా చేవెళ్ల సభకు వెళ్తారు. సభలో ఆయన సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉండి.. ఆ వెంటనే ఢిల్లీకి తిరుగ పయనమవుతారు.
కాగా ఆర్ఆర్ఆర్ టీమ్‌తో, అలాగే రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్ షా తర్వాతి పర్యటనలో సమావేశం కానున్నారని పార్టీ వర్గాల సమాచారం.నిజానికి ఆర్ఆర్ఆర్ టీమ్‌తో భేటీ అయ్యి ఆస్కార్ సాధించినందుకు వారిని సన్మానించాల్సి ఉంది. అయితే కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ఆయనకు అత్యవసర సమావేశాలు ఉన్నాయి. దీంతో అమిత్ షా తన షెడ్యూల్‌లో ఆయా మార్పులు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..