Sarpanch Elections: ఆడపిల్ల పుడితే రూ.5 వేలు.. ఇలాంటి 14 హామీలతో సర్పంచ్ అభ్యర్థి భారీ మేనిఫెస్టో

| Edited By: Jyothi Gadda

Oct 14, 2024 | 1:28 PM

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధానపార్టీలకు ప్రతిష్టాత్మకం కాబోతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు సిద్ధమవుతున్నారు. తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్లుగా ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానంటూ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తున్నారు.

Sarpanch Elections: ఆడపిల్ల పుడితే రూ.5 వేలు.. ఇలాంటి 14 హామీలతో సర్పంచ్ అభ్యర్థి భారీ మేనిఫెస్టో
Sarpanch Candidate
Follow us on

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఒకవైపు ప్రభుత్వం కసరత్తు చేస్తుండగానే.. మరోవైపు ఆశావాహులు కూడా సిద్ధమవుతున్నారు. అర్ధ, అంగ బలంతోపాటు ఎన్నికల్లో ఇచ్చే హామీలపై కూడా ఆశావాహులు క్లారిటీగా ఉన్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకున్నా.. కొందరు అప్పుడే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తున్నారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపూర్ చెందిన కొడారి లత మల్లేష్ కు రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ. దీంతో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె సిద్ధమవుతున్నారు.

ఒక్కసారి అవకాశం ఇవ్వండి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని కొడారి లత మల్లేష్ .. గ్రామంలో దసరా, దీపావళి శుభకాంక్షలు తెలుపుతూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. తాను సర్పంచ్ గా గెలిపిస్తే ఏ పనులు చేస్తానో తెలియజేస్తూ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. గ్రామ పంచాయితీలో గ్రామ ప్రజలందరికీ త్రాగునీరు ఉచిత సౌకర్యాన్ని కల్పిస్తామని, కులాలకు అతీతంగా దహన సంస్కారాల కోసం అవసరమయ్యే ఫ్రీజర్ బాక్స్, వైకుంఠ రథం, వాటర్ ట్యాంకర్ ను ఉచితంగా అందజేస్తామని హామీ ఇస్తున్నారు. ఎవరైనా చనిపోతే మృతుని కుటుంబానికి రూ.20వేల ఆర్థిక సహాయం, కుటుంబంలో ఆడపిల్ల జన్మిస్తే రూ.5000 ఆర్థిక సహాయం ఇస్తామంటూ పెద్ద పెద్ద హామీలతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.

గ్రామంలో అన్ని కులాలకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తామని, నిరుద్యోగ ఆడపడుచుల కోసం 30 కుట్టుమిషన్ల ట్రైనింగ్ టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామంలో అండర్ డ్రైనేజ్, సీసీ రోడ్లు, గ్రామంలో బస్తీ దావాఖాన, గ్రంథాలయం ఏర్పాటు వంటి 14 హామీలతో కూడిన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. తనను గెలిపిస్తే ఇచ్చిన హామీలను నెరవేర్చు పారదర్శక పాలన అందిస్తానని కొడారి లత మల్లేష్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే తెలివైన గ్రామ ఓటరు మహాశాయులు ఈ హామీలకు ఓట్లు వేస్తారో లేదో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..