- Telugu News Photo Gallery Health tips these natural home remedies for sparkling white teeth and that beautiful smile
ముత్యాలాంటి దంతాల కోసం వంటింటి చిట్కాలు..! ఇలా చేస్తే అందమైన చిరునవ్వు మీ సొంతం..
దంతాలు ముత్యాళ్ల తెల్లగా, మిలమిలా మెరిసిపోతూ కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎందుకంటే.. మన ముఖంలో చిరునవ్వును మరింత అందంగా మార్చేవి మన నోట్లోని దంతాలే. తెల్లటి మెరిసే దంతాలు మనల్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. మెరిసే దంతాల కోసం చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. పసుపు దంతాలు మనల్ని నలుగురిలో మనస్ఫూర్తిగా మాట్లాడలేకుండా ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటి వారికి ఈ సింపుల్ టిపుల్స్ బాగా ఉపయోగపడతాయి. వీటిని పాటిస్తే మీ దంతాలు తెల్లగా మెరవడమే కాదు దృఢంగా మారుతాయి.
Updated on: Oct 14, 2024 | 11:56 AM

పసుపు దంతాలను తెల్లగా మార్చేందుకు ఇంటి చిట్కాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. అలాంటి సహజ పరిష్కారాలలో ఒకటి బేకింగ్ సోడా. దీనిని సోడియం బైకార్బోనేట్ అని కూడా పిలుస్తారు. బేకింగ్ సోడాను పటిక పొడిని సమాన నిష్పత్తిలో కలపి బ్రష్ చేయండి. వారానికి రెండు సార్లు ఇలా చేయండి. మీరు బేకింగ్ సోడాతో టూత్‌పేస్ట్‌ను కూడా ఉపయోగించవచ్చు.

వేప పుల్లతో కూడా పసుపు దంతాలకు స్వస్తి చెప్పొచ్చు. వేపలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మనలో చాలా మంది ఇప్పటికీ వేప పుల్లను బ్రష్ గా వాడుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ గుణాలు పసుపు రంగును తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మీ దంతాలను తెల్లగా చేయడంతోపాటు చిగుళ్లను బలోపేతం చేస్తుంది.

సిట్రస్ పండ్ల తొక్కలు పసుపు దంతాలకు చక్కటి పరిష్కారంగా పనిచేస్తాయి. పండ్లు మీ దంత ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి. అరటిపండు, నిమ్మకాయ లేదా నారింజ తొక్క మరియు స్ట్రాబెర్రీ పేస్ట్‌ని మీ దంతాలకు అప్లై చేయడం వల్ల తెల్లగా మెరవడంతోపాటు బలంగా తయారువుతాయి.

వేప పుల్లతో కూడా పసుపు దంతాలకు స్వస్తి చెప్పొచ్చు. వేపలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు పసుపు రంగును తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మీ దంతాలను తెల్లగా చేయడంతోపాటు చిగుళ్లను బలోపేతం చేస్తుంది.

ఎండిన తులసి ఆకులను ఆవాల నూనెతో మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని దంతాలపై రాయండి. దీంతో మీ పళ్లు తెలతెల మెరుస్తాయి. తులసి మౌత్ వాష్ యాంటీప్లాక్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఈ రెమెడీని పాటిస్తే కేవలం కొద్ది రోజుల్లోనే దంతాలు ముత్యాల మాదిరి తెల్లగా, ఆకర్షణీయంగా మారతాయి. పసుపు దంతాలతో బాధపడే వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించేందుకు ట్రై చేయండి.




