Watch: ఇదేందిది నేనేడా చూడలే !! అచ్చం బోయపాటి ఫిజిక్స్‌ దించేశాడుగా… వీడియో చూస్తే

ఇంటర్నెట్‌లో ఈ వీడియోను జనాలు విపరీతంగా ఇష్టపడుతున్నారు. ఇప్పటికే ఈ వీడియోను 20 లక్షలకు పైగా వీక్షించారు. చాలా మంది ఈ వీడియోపై తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇంతకీ వీడియోలో ఏముందో క్లీయర్‌గా చూడాల్సిందే..!

Watch: ఇదేందిది నేనేడా చూడలే !! అచ్చం బోయపాటి ఫిజిక్స్‌ దించేశాడుగా... వీడియో చూస్తే
Man Was Seen Hanging In The Air
Follow us

|

Updated on: Oct 14, 2024 | 10:50 AM

ఇది సోషల్ మీడియా యుగం.. ఇక్కడ ప్రతిరోజూ ఏదో ఒక కొత్తదనం కనిపిస్తుంది. ఈసారి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియోలో, ఒక వ్యక్తి గోడకు ఒక చేతిని అదిమి పెట్టి గాలిలో వేలాడుతున్నాడు. ఇంటర్నెట్‌లో ఈ వీడియోను జనాలు విపరీతంగా ఇష్టపడుతున్నారు. ఇప్పటికే ఈ వీడియోను 20 లక్షలకు పైగా వీక్షించారు. చాలా మంది ఈ వీడియోపై తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇంతకీ వీడియోలో ఏముందో క్లీయర్‌గా చూడాల్సిందే..!

వైరల్‌ వీడియోలో ఒక వ్యక్తి కొన్ని కార్డ్‌బోర్డ్ పెట్టెల సహాయంతో ఓ ఎత్తైన గోడకు దగ్గరగా ఎత్తులో నిల్చొని ఉన్నాడు. అతడు తన చేతిని గోడకు అదిమిపెట్టి ఉంచాడు. అంతలో మరో వ్యక్తి వచ్చి ఆ పెట్టెలను కర్రతో కొట్టి కిందపడేలా చేశాడు. అట్ట పెట్టెలు పడిపోయాయి. కానీ, అతను మాత్రమ గాల్లో అలాగే వేలాడుతున్నాడు.. ఎలాంటి సపోర్టు లేకుండా కేవలం గోడకు ఒక చేతిని అణించి ఉంచాడు. ఆ వ్యక్తి అలా గాలిలో వేలాడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, వీడియోలో స్టంట్‌ చేసిన వ్యక్తి మెజీషియన్ అని తెలిసింది.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వీడియో ఎక్కువగా వైరల్ అవుతోంది. ప్రజలు దీనికి వివిధ రకాల రియాక్షన్‌లు ఇస్తున్నారు. కొంతమంది ఈ వీడియోను అద్భుతం అని పిలుస్తుంటే, మరికొంత మంది దీనిని కళ్లకు కట్టినట్లుగా అభివర్ణిస్తున్నారు. ఈ మేజిక్ చాలా భయానకంగా ఉందని మరొకరు కామెంట్‌ చేశారు.. ఈ వీడియోను @xaviermortimer అనే వినియోగదారు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. ఈ వీడియోను 20 లక్షల కంటే ఎక్కువ మంది చూశారు. 27 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..