- Telugu News Photo Gallery Haircare Tips Bitter gourd is a home remedy for hair growth you need to try!
ఈ ఆకుపచ్చ కూరగాయతో హెయిర్‌ప్యాక్ ట్రై చేయండి.. నల్లటి మెరుపుతో ఒత్తైన జుట్టు మీ సొంతం..!
కాకరకాయలో యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌ను నిర్మూలిస్తుంది. కాకరకాయ రసం తలలో తేమను తగ్గించి, చుండ్రు పెరగకుండా చేస్తుంది. ఒక అధ్యయనంలో కాకరకాయలో ఉండే కణాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయని తేలింది. ఇవి మాడుకు పోషణను ఇచ్చే జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, కాకరకాయతో జుట్టు సమస్యలకు ఎలా చెక్ పెట్టొచ్చు ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Oct 14, 2024 | 1:15 PM

తాజాగా ఉన్న, ముదురు ఆకుపచ్చగా ఉన్న కాకరకాయను తీసుకోండి. కాకరకాయను బాగా కడిగి, చిన్న చిన్న ముక్కలుగా కోసి, విత్తులను తీసివేయాలి. కాకరకాయ ముక్కలను బ్లెండర్ జార్‌లో వేసి, పాలు కలిపి మిక్సీ చేయండి.

మిక్సీ చేసిన పేస్ట్‌ను జల్లెడలతో రసం తీయండి. రసాన్ని తలకు పూర్తిగా అప్లై చేసి స్మూత్‌గా మసాజ్ చేసి, 30 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తరువాత చల్లటి నీటితో తలను శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వారానికి 2-3 సార్లు ఈ రసాన్ని తలకు పట్టించవచ్చు. త్వరలో చక్కటి మార్పును గమనిస్తారు.

అలాగే, కాకరకాయ నూనెను తయారు చేసుకోవచ్చు. కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెలో కాకరకాయ ముక్కలను వేసి కొన్ని రోజులు పాటు నిల్వ ఉంచాలి. ఆ తర్వాత ఆ ముక్కలను పిండి తీసేయండి. ఆ నూనెను జుట్టుకు పట్టించండి. ఇది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

కాకరకాయలో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువ. ఇది తలపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనివల్ల జుట్టు రాలకుండా ఆగుతుంది. అలాగే తలపై ఉన్న మాడును ఇది హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.

కాకరకాయలో ఉండే విటమిన్లు వెంట్రుకలను అందంగా, పొడవుగా పెరిగేలా చేస్తుంది. కాకరకాయ జ్యూస్ మీ జుట్టుకు సహజమైన కండిషనర్ల పనిచేస్తుంది. జుట్టును విరిగిపోకుండా నిరోధిస్తుంది.




