TGSRTC: ఆర్టీసీలో 3038 పోస్టుల భర్తీ.. వారితో అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ హెచ్చరిక..

టీజీఎస్‌ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను కొందరు మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రభుత్వ అనుమతితో 3038 పోస్టుల భర్తీకి సంబంధించిన కసరత్తు ప్రారంభమైనట్లు తెలిపారు. నియామక ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగా పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు.

TGSRTC: ఆర్టీసీలో 3038 పోస్టుల భర్తీ.. వారితో అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ హెచ్చరిక..
RTC MD Vc Sajjanar

Edited By: Krishna S

Updated on: Aug 09, 2025 | 11:00 PM

తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌‌లో త్వరలోనే భారీ నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 3,038 పోస్టుల భర్తీకి ఏర్పాట్లు జరుగుతున్నాయని టీజీఆర్టీసీ ఎండీ వి.సీ. సజ్జనార్ వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన ఆయన నియామక ప్రక్రియ పూర్తిగా రూల్స్ ప్రకారం, స్కిల్ ఆధారంగా జరుగుతుందని స్పష్టం చేశారు. త్వరలోనే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది.

మోసపోవద్దు.. సజ్ఞనార్ హెచ్చరిక

రాష్ట్రంలోని నిరుద్యోగ యువత… ఆర్టీసీ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బు గుంజే మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ హెచ్చరించారు. ఎవరైనా డబ్బు, సిఫార్సుతో ఉద్యోగం ఇప్పిస్తామని చెబితే, వెంటనే తనను లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచించారు. పక్కదారుల్లో ప్రయత్నాలు చేసినవారికి ఆర్టీసీలో ఉద్యోగం దక్కదన్నారు. ఎవ్వరూ మోసపోవద్దని.. డబ్బుతో, సిఫారసుతో ఉద్యోగాలు రావని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. నష్టాల్లో ఉన్న టీజీఆర్టీసీ ఇప్పుడు లాభాల్లోకి వచ్చిందని సజ్జనార్ చెప్పారు. స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి రావడంతో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని, ఇందుకు అనుగుణంగా కొత్త బస్సులు కూడా రోడ్డుపైకి తెస్తున్నట్టు సజ్జనార్ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..