Congress Leaders: సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. తాజాగా జిల్లాకు చెందిన ముగ్గురు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. వివరాల్లోకెళితే.. సదాశివపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు సోమవారం నాడు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి హరీష్ రావు సమక్షంలో వీరు టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరితో పాటు సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ నేతలు సహా కార్యకర్తలు కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పటికే రాష్ట్రంలో అంతంతమాత్రంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ పెద్దలు ప్రయత్నాలు చేస్తుంటే.. కిందిస్థాయి నేతలు ఇలా ఇతర పార్టీల్లోకి వెళుతుండటంతో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్యాయం తామే అని చెప్పుకుంటున్న బీజేపీ నుంచి కూడా వలసలు ఆగడం లేదు. మరికొందరు బీజేపీ నేతలు, కార్యకర్తలు త్వరలోనే తమ పార్టీలో చేరుతారంటూ టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
Also read: