పల్లెల్లో ‘పంచాయతీ’ సందళ్లు.. ఊరుఊరంతా ఒకటే గుసగుస..! ఇంతకీ ఊరికి మొనగాడు ఎవరు?

సర్పంచ్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు చోటు లేదు. తమ గ్రామాన్ని పాలించేందుకు.. తమలో ఒకరిని 'ప్రెసిడెంట్'ను చేసుకునేందుకు ప్రజలు ఎన్నుకునే ఎన్నిక ఇది. స్వపరిపాలనకు అసలైన అర్ధం ఈ సర్పంచ్ ఎన్నికలు. బట్.. ఇప్పుడా పరిస్థితి లేదనుకోండి. గ్రామాల్లో ఎవరు సర్పంచ్ అభ్యర్ధిగా నిలబడాలో శాసించేది ఆఖరికి రాజకీయ పార్టీలే అవుతున్నాయి. పోటీ చేయాలనుకున్న అభ్యర్ధుల కూడా రాజకీయ పార్టీల అండదండలు కోరుకుంటున్నారు. పార్టీల జోక్యం ఉంటోంది కాబట్టే ఎన్నికలు మరింత రంజుగా సాగుతున్నాయి. సో, ఊళ్లల్లో పైచేయి 'చేతి' గుర్తుదా, కారుదా, కమలమా, సుత్తికొడవలా, కంకి కొడవలా, పతంగినా.. ఎవరు బలపరిచిన అభ్యర్ధి గెలుస్తాడనే దానిపైనే ఇప్పుడు చర్చంతా జరుగుతోంది. ఇంతకీ.. గ్రౌండ్ లెవెల్‌లో పరిస్థితి ఎలా ఉంది?

పల్లెల్లో పంచాయతీ సందళ్లు.. ఊరుఊరంతా ఒకటే గుసగుస..! ఇంతకీ ఊరికి మొనగాడు ఎవరు?
Telangana Panchayat Elections

Updated on: Nov 26, 2025 | 9:53 PM

ఊళ్లలో రచ్చబండ దగ్గర ఒకటే చర్చ జరుగుతోంది. మన ఊరి సర్పంచ్‌గిరీ ఎవరికి వస్తదో అని..! అటు ఇటుగా ఏడేళ్లైంది పంచాయతీ ఎన్నికలు జరిగి. ఆల్‌మోస్ట్ రెండేళ్లుగా ప్రత్యేక పాలనలోనే నడుస్తున్నాయి గ్రామాలు. ఇన్నేళ్లకు ‘మనోడే’ సర్పంచ్ అభ్యర్ధి అని మాట్లాడుకునే రోజులు వచ్చాయి. ఊళ్లలో పలకరింపులు మొదలయ్యాయి. తనవాళ్లు, పరాయివాళ్లు అని లేదు. అందరూ తనవాళ్లే అన్నట్టుగా తిరుగుతున్నారు. మరోవైపు.. ‘సర్పంచ్ టికెట్ నాకేగా’ అని నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరగవు. అందుకే, ‘ఫలానా పార్టీ బలపరిచిన అభ్యర్ధి’ అనే లెక్కన ఎన్నికలు జరుగుతాయి. ఆ లెక్కన ప్రతి పార్టీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమే. సర్పంచ్ ఎన్నికలే ఏ పార్టీకైనా ఆయువుపట్టు. ఊళ్లలో పట్టు సాధించిన పార్టీలకే మనుగడ ఉంటుంది. అందుకే, అంత ప్రెస్టేజియస్. ఇదంతా ఓవైపు అయితే.. మరోవైపు బీసీ రిజర్వేషన్ల రగడ జరుగుతోంది. ’42 శాతం అన్నారు.. తీరా చూస్తే 17 శాతంతోనే వెళ్తున్నారు’ అంటూ బీసీ సంఘాలు, ప్రతిపక్షాలు విమర్శలు మొదలుపెట్టాయి. ‘ఈ పరిస్థితి ఉంటుందనేగా బీసీ డిక్లరేషన్ ప్రకటించి, రాష్ట్రపతి దాకా బిల్లు పంపించింది’ అని కౌంటర్ ఇస్తోంది ప్రభుత్వం. సో, సర్పంచ్ ఎన్నికల ఓవరాల్ పిక్చర్ చూద్దాం.. సర్పంచ్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు చోటు లేదు. తమ గ్రామాన్ని పాలించేందుకు.. తమలో ఒకరిని ‘ప్రెసిడెంట్’ను చేసుకునేందుకు ప్రజలు ఎన్నుకునే ఎన్నిక ఇది. స్వపరిపాలనకు అసలైన అర్ధం ఈ సర్పంచ్...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి