Telangana: రాత్రి మూసేసిన షాప్ షట్టర్ తెల్లారేసరికి తెరిచి ఉంది.. లోపలికి వెళ్లి చూడగా
మహబూబాబాద్ జిల్లాలో దొంగలు దడ పుట్టిస్తున్నారు. కేసముద్రం మండల కేంద్రంలో భారీ దోపిడి జరిగింది. మహాలక్ష్మి ట్రేడర్స్‌లో 13 లక్షల రూపాయల నగదు అపహరణ జరిగింది. కౌంటర్‌లోని నగదు మొత్తం మూట కట్టుకొని పారిపోయాడు ఓ దొంగ. ఆ వివరాలు ఇలా..

సమ్మర్ సీజన్‌తో దొంగల సీజన్ కూడా మొదలైనట్టుంది. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ దొంగలు రెచ్చిపోతూనే ఉన్నారు. తమదైనశైలిలో చోరీలకు పాల్పడుతూనే ఉన్నారు. చెడ్డీగ్యాంగ్, ట్యాటూ గ్యాంగ్ ఇలా రోజుకో గ్యాంగ్ ఊరిమీదపడి దోచుకుంటున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి ఓ దుకాణంలో చొరబడి లక్షల రూపాయల నగదు మూటగట్టుకుపోయారు. ఉదయం షాపు తెరిచి చూసిన యజమాని చోరీ జరిగిందని గ్రహించి లబోదిబోమన్నాడు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో భారీ దోపిడీ జరిగింది. గురువారం రాత్రి మహాలక్ష్మి ట్రేడర్స్ షాపులో చొరబడిన ఓ దొంగ కౌంటర్‌లోని డెస్క్‌లో ఉన్న 13 లక్షల రూపాయలను చక్కగా టవల్‌లో మూటకట్టుకొని వెళ్లిపోయాడు. కనీసం ఆ దొంగ మాస్క్ కూడా పెట్టుకోలేదు. సీసీ కెమెరాలు ఉన్నయేమోనన్న భయం కూడా అతనిలో కనిపించలేదు. షట్టర్ తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగ చాలా కూల్‌గా క్యాష్ కౌంటర్ తాళం పగలకొట్టి అందులో ఉన్న నగదు మొత్తం నీట్‌గా తీసి టేబుల్ పైన పెట్టి అక్కడ సంచి ఏమైనా దొరుకుతుందేమో అని చూసిన అతనికి ఏమీ దొరక్కపోవడంతో తను వెంట తెచ్చుకున్న టవల్లో మూటకట్టి తీసుకొని వెళ్లిపోయాడు. ఇదంతా అక్కడి CC కెమెరాల్లో రికార్డయింది. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించే పనిలో పడింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ చూడండి
