Viral: రన్నింగ్ ట్రైన్‌లో ఓ కోచ్ నుంచి ఘాటైన వాసన.. RPF సిబ్బంది అక్కడి లగేజ్ బ్యాగులకు చెక్ చేయగా..

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: Jun 11, 2022 | 9:38 PM

రన్నింగ్ ట్రైన్‌లో కూడా కొంతమంది రైల్వే పోలీసులు ఉంటారు. వారు అన్ని కోచ్‌లు తిరుగుతూ ప్రయాణీకులు భద్రతను చెక్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తనిఖీలు చేస్తున్న RPF సిబ్బందికి ఓ కోచ్‌లో మిస్టరీ స్మెల్ వచ్చింది.

Viral: రన్నింగ్ ట్రైన్‌లో ఓ కోచ్ నుంచి ఘాటైన వాసన.. RPF సిబ్బంది అక్కడి లగేజ్ బ్యాగులకు చెక్ చేయగా..
20805 Train

ట్రైన్లలో ప్రయాణీకుల భద్రత కోసం RPF సిబ్బంది తనిఖీలు చేస్తారన్న విషయం తెలిసిందే. రన్నింగ్ ట్రైన్‌లో కూడా కొంతమంది రైల్వే పోలీసులు ఉంటారు. తాజాగా ట్రైన్ నంబర్ 20805 విశాఖపట్నం(Vizag)-ఢిల్లీ(Delhi) ఎక్స్‌ప్రెస్‌లో వెళ్తున్న ట్రైన్‌లో RPF టీమ్ తనిఖీలు చేస్తుండగా.. పెద్ద బాగోతం వెలుగుచూసింది. ఓ కోచ్‌లో వారికి ఘాటైన వాసన వచ్చింది. ఎందుకైనా మంచిదని అక్కడి లగేజ్ బ్యాగులను చెక్ చేయడం ప్రారంభించారు. అక్కడి 4 బ్యాగుల్లో గంజాయి బయటపడింది. దీంతో పోలీసులు ఆ బ్యాగులను తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా మరో కోచ్‌లో ఉన్న తమ ముఠా సభ్యుల గురించి చెప్పేశారు. ఎస్-5 కోచ్‌లో 4 బ్యాగులు, బి1 కోచ్‌లో 5 బ్యాగులు లభించాయి. వీటిల్లో 8 బ్యాగుల్లో గంజాయి నింపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి 106.807 కిలోలు కాగా.. దాని విలువరూ.16,02,105గా అంచనా వేశారు. అదుపులోకి తీసుకన్న ఏడుగురు నిందితులను లోహ్‌మార్గ్ పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి నిందితులను జూన్ 16 వరకు పోలీసు కస్టడీకి పంపారు. నిందితుల్లో ఐదుగురు పురుషులు సహా ఇద్దరు మహిళలు ఉన్నారు. ఒక మైనర్ కూడా ఉన్నాడు.

నిందితుల్లో సోనమ్ షకీల్ అహ్మద్ (25), మహ్మద్ ఆసిఫ్ అహ్మద్ (20), గుల్ఫాన్ ఉస్మాన్ ఖాన్ (19), మరో మైనర్ బాలుడు ఢిల్లీకి చెందినవారు. గుల్షన్ షరీఫ్ (35), సైఫ్ అలీ అష్రఫ్ అలీ అన్సారీ (22),విజేందర్ సింగ్ ఘజియాబాద్ వాసులు. ఈ నిందితులు 2 గ్రూపులుగా విడిపోయి గంజాయి అక్రమ రవాణా చేస్తుండగా RPF సిబ్బంది పట్టుకున్నారు. విశాఖపట్నంలో గంజాయిని కొనుగోలు చేసిఢిల్లీ, ఘజియాబాద్‌లలో విక్రయించేందుకు అక్రమంగా తరలిస్తున్నట్లు  విచారణలో నిందితులు ఒప్పుకున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu