Whatsapp Status: చిచ్చు పెట్టిన వాట్సాప్ స్టేటస్.. పోలీసుస్టేషన్ ముందు ఆందోళన.. పోలీసుల లాఠీచార్జ్
Whatsapp Status: చిన్నపాటి సంఘటనలో పెద్ద గొడవలకు దారి తీస్తుంది. ఈ రోజుల్లో వాట్సాప్ లేనిది ఎవ్వరు ఉండటం లేదు. స్మార్ట్‌ఫోన్ ఉంటంటే చాలు రకరకాల వాట్సాప్ స్టేటస్‌లే
Whatsapp Status: చిన్నపాటి సంఘటనలో పెద్ద గొడవలకు దారి తీస్తుంది. ఈ రోజుల్లో వాట్సాప్ లేనిది ఎవ్వరు ఉండటం లేదు. స్మార్ట్‌ఫోన్ ఉంటంటే చాలు రకరకాల వాట్సాప్ స్టేటస్‌లే కనిపిస్తుంటాయి. ఆ వాట్సాప్ స్టేటస్‌లే ఘర్షణలకు దారి తీస్తున్నాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో ఓ వాట్సాప్ స్టేషన్ పెద్ద ఘర్షణకు దారి తీసింది. ఓ వర్గానికి చెందిన వ్యక్తి ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యాలతో వాట్సాప్ స్టేటష్ పెట్టాడంటూ ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసుస్టేషన్‌ను ముట్టడించింది మరో వర్గం. పోలీసు స్టేషన్ ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది. దీంతో పోలీసులు వారి ఆందోళనను విరిమించే విధంగా ఎంత సముదాయించినా వినకపోవడంతో రంగంలోకి దిగి లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆందోళనకారులు తోసుకుంటూ స్టేషన్‌లోకి దూసుకెళ్లారు. పోలీసు బలగాలు పరిస్థితిని అదుపులోకి చేస్తున్నారు. ఈ ఘటనలో పలువురిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఆందోళనలో కొందరి ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి.
కాగా, ఈ స్మార్ట్‌ఫోన్స్ వచ్చిన నాటి నుంచి ఎన్నో అనర్థాలు పెరిగిపోతున్నాయి. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఇష్టానుసారంగా స్టేటస్‌లు పెట్టుకోవడం, ఇతరులను ఉద్దేశించి స్టేటస్‌లు పెట్టుకోవడం వల్ల ఇలాంటి ఘనలకు దారి తీస్తుంది. కొందరైతే ఎవరి మీదనైనా కోసం ఉంటే అది వాట్సాప్ స్టేటస్ రూపంలో పెట్టుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి