కోడుగుడ్డు కోసం.. ఓ వ్యక్తిపై రౌడీషీటర్ల దాడి

నిజామాబాద్ జిల్లాలో ఓ యువకుడిపై రౌడీషీటర్ల దాడి సంచలనం రేపింది. కోడిగుడ్డు కొనే విషయంలో మొదలైన తగాదా.. చినికిచినికి గాలివానలా మారింది. చివరికి అతి దారుణంగా బాటిళ్లతో దాడి చేసే వరకూ వెళ్లింది. పట్టణంలో కోటగల్లిలో సూపర్ మార్కెట్ నడుపుతున్న సోమినేని రాజుపై రౌడీ షీటర్లు శ్రీనివాస్, క్రాంతి దాడి చేశారు. సూపర్ మార్కెట్‌కు వచ్చిన శ్రీనివాస్, క్రాంతి కోడి గుడ్డు కొనే విషయంలో యజమాని రాజుతో గొడవపడ్డారు. చిన్నగా మొదలైన వివాదం కాస్తా.. చివరకు రాజుపై […]

కోడుగుడ్డు కోసం.. ఓ వ్యక్తిపై రౌడీషీటర్ల దాడి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Apr 02, 2019 | 1:12 PM

నిజామాబాద్ జిల్లాలో ఓ యువకుడిపై రౌడీషీటర్ల దాడి సంచలనం రేపింది. కోడిగుడ్డు కొనే విషయంలో మొదలైన తగాదా.. చినికిచినికి గాలివానలా మారింది. చివరికి అతి దారుణంగా బాటిళ్లతో దాడి చేసే వరకూ వెళ్లింది. పట్టణంలో కోటగల్లిలో సూపర్ మార్కెట్ నడుపుతున్న సోమినేని రాజుపై రౌడీ షీటర్లు శ్రీనివాస్, క్రాంతి దాడి చేశారు.

సూపర్ మార్కెట్‌కు వచ్చిన శ్రీనివాస్, క్రాంతి కోడి గుడ్డు కొనే విషయంలో యజమాని రాజుతో గొడవపడ్డారు. చిన్నగా మొదలైన వివాదం కాస్తా.. చివరకు రాజుపై విచక్షణారహితంగా దాడికి దారితీసింది. రాజుపై శ్రీనివాస్, క్రాంతి సీసాలతో దాడి చేశారు. ముఖంపై సీసాలతో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు రాజు.

ఈ దాడి ఆదివారం సాయంత్రం జరిగినప్పటికీ విషయం ఎవరికీ తెలియలేదు. ఒక వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. ఇది కాస్తా వైరల్ అయ్యింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బాధితుడు రాజు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దాడిపై విచారించిన పోలీసులు.. నిందితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.