Revanth Reddy: మోదీ ప్రధాని అయ్యాక జనాభాను లెక్కించడం మానేశారు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Revanth Reddy TV9 Exclusive Interview: ప్రతీ పదేళ్లకు జనాభాను లెక్కించాలి.. మోదీ ప్రధాని అయ్యాక జనాభాను లెక్కించడం మానేశారు.. బీజేపీ ప్రధానమైన రాజకీయ పార్టీ కాదు.. బీజేపీకి ఆర్‌ఎస్‌ఎస్‌ మాతృసంస్థ.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. రిజర్వేషన్ల రద్దుపై కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Revanth Reddy: మోదీ ప్రధాని అయ్యాక జనాభాను లెక్కించడం మానేశారు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Revanth Reddy

Updated on: May 09, 2024 | 9:51 PM

Revanth Reddy TV9 Exclusive Interview: ప్రతీ పదేళ్లకు జనాభాను లెక్కించాలి.. మోదీ ప్రధాని అయ్యాక జనాభాను లెక్కించడం మానేశారు.. బీజేపీ ప్రధానమైన రాజకీయ పార్టీ కాదు.. బీజేపీకి ఆర్‌ఎస్‌ఎస్‌ మాతృసంస్థ.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. రిజర్వేషన్ల రద్దుపై కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు. టీవీ9తో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీని నిలువరించడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. ఆధారరహితమైన ఆరోపణలను ప్రజలు అంగీకరించరన్నారు. కులగణన చేస్తేనే రిజర్వేషన్లను మార్చే అవకాశం ఉందన్నారు.

బీజేపీకి 400సీట్లువస్తే రిజర్వేషన్లు రద్దుచేస్తారంటూ సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. BJP 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది.. బీసీల జనాభాను లెక్కించబోమని బీజేపీ చెబుతోందంటూ పేర్కొన్నారు. కులగణన చేయాలన్నది కాంగ్రెస్‌ వాదన అన్నారు. ఎందుకు బీసీల కులగణన చేయడం లేదని ప్రశ్నించారు. కులగణన చేస్తేనే రిజర్వేషన్ల పెంపునకు అవకాశం ఉందన్నారు.

అసెంబ్లీఎన్నికల్లో ఇందిరమ్మరాజ్యం వస్తుందని చెప్పా.. తెలంగాణలో మార్పు వస్తుందని కూడా ముందే చెప్పా.. అంటూ సీఎం రేవంత్‌ అన్నారు. రాజ్యాంగాన్ని బీజేపీ మార్చబోతోంది అని.. బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేయబోతోందంటూ ఆరోపించారు. బీజేపీకి కుట్రలే ఎన్నికల్లో ప్రధాన అజెండా అంటూ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పాత్ర లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

డిసెంబర్‌లో సెమీఫైనల్స్‌ జరిగాయి.. ఈ నెల 13న ఫైనల్స్ జరగబోతున్నాయి.. అంటూ పేర్కొన్నారు. జెండా మారింది అజెండా మారింది.. ఎన్నికల పంథా మారింది.. అంటూ రేవంత్ అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..