Revanth Reddy: రేవంత్ రెడ్డి సొంతూళ్లో అంబరాన్నంటిన సంబరాలు.. కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త జోష్..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. క్లియర్ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం లభించింది. అయితే సీఎం అభ్యర్థి ఎవరన్న విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే తాజాగా రెండు రోజుల ఉత్కంఠకు తెరపడింది. పీసీసీ చీఫ్‌గా.. పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషించిన రేవంత్ రెడ్డినే సీఎల్పీ నేతగా పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. క్లియర్ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం లభించింది. అయితే సీఎం అభ్యర్థి ఎవరన్న విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే తాజాగా రెండు రోజుల ఉత్కంఠకు తెరపడింది. పీసీసీ చీఫ్‌గా.. పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషించిన రేవంత్ రెడ్డినే సీఎల్పీ నేతగా పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. దీంతో ఆయన ఈ నెల 7న తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తనను సీఎల్పీ నేతగా ఎంపిక చేయడం పట్ల ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. ఢిల్లీలో సుదీర్ఘ మంతనాల అనంతరం పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ సీనియర్లు.. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే కేసీ వేణుగోపాల్ ఈ ప్రకటన చేశారు. రేవంత్ సీఎల్పీ నేతగా ఉన్నప్పటికీ.. వన్ మ్యాన్ షో ఉండదనీ.. సమిష్టిగా నిర్ణయాలు ఉంటాయన్నారు కేసీ వేణుగోపాల్. సీనియర్లకు తగిన ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారాయన.
తెలంగాణ సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డి పేరు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కోడంగల్‌లోని ఆయన స్వగృహం వద్ద టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించుకుంటున్నారు పార్టీ శ్రేణులు. రేవంత్‌ని సీఎంగా ఎంపిక చేయడం పట్ల తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని రేవంత్ ఇంటి దగ్గర భారీగా భద్రత పెంచారు. బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఏసీపీతో పాటు స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరిన్ని సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోనూ రేవంత్ రెడ్డి అభిమానులు, అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటున్నారు. ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకుంటూ చిందులు వేస్తున్నారు. పార్టీ గెలిచిన నాటి నుంచి ఈరోజు వరకూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే రేవంత్‌ని సీఎంగా ప్రకటించారన్నారు మల్లు రవి. తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ చేస్తామన్నారాయన. పార్టీ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాల్సిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్. సీఎల్పీగా రేవంత్‌ని ప్రకటించడానికి కొన్ని నిమిషాల ముందు రైతులను, వర్షాలను ఉద్దేశించి తెలుగులో చేశారు రేవంత్ రెడ్డి. అయితే ఈనెల 7న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు రేవంత్ రెడ్డి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








