TS Registration Charges: మరో కీలక నిర్ణయం.. తెలంగాణలో రేపటి నుంచి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెంపు..!

|

Jul 20, 2021 | 6:27 AM

TS Registration Charges: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల కొత్త విలువల అమలుకు రంగం సిద్ధం అయ్యింది..

TS Registration Charges: మరో కీలక నిర్ణయం.. తెలంగాణలో రేపటి నుంచి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెంపు..!
Follow us on

TS Registration Charges: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల కొత్త విలువల అమలుకు రంగం సిద్ధం అయ్యింది. భూముల విలువతో పాటు పెరిగిన రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చేలా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో భూములు విలువను ప్రాంతీయవారీగా పెంచారు. అయితే గరిష్ఠంగా 50 శాతం వరకు పెరుగగా, కనిష్ఠంగా 20 శాతం వరకు ఉంది. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువతో పాటు ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో ప్లాట్లకు కొత్త విలువలను నిర్ధారించింది ప్రభుత్వం. పెంచిన విలువకు సంబంధించి మూడు రోజులుగా కసరత్తు చేస్తున్నారు. సవరించిన విలువలను సబ్‌ రిజిస్టార్లకు పంపగా, వారు పూర్తిగా పరిశీలించి ఖరారు చేశారు. అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు చైర్మన్‌గా, సబ్‌రిజిస్టార్లు కన్వీనర్లుగా, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, జిల్లా రిజిస్టార్‌ సభ్యులుగా ఉన్న వీరు మార్కెట్‌ విలువ సవరణ కమిటీలు కూడా పరిశీలించి ఆమోద ముద్ర వేశాయి.

కేబిట్‌ సబ్‌ కమిటీ భేటీలో నిర్ణయం

రాష్ట్రంలోని జిల్లా రిజిస్టార్లందరూ మార్కెట్‌ విలువల అసలు రిజిష్టర్‌లను మంగళవారం హైదరాబాద్‌లోని స్టాంపులు, రిజిష్ట్రేషన్ల శాఖ కార్యాలయంలో అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. భూముల మార్కెట్‌ విలువ పెంపుతో పాటు రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను ప్రభుత్వం పెంచింది. 6 శాతం ఉన్న రిజిస్ట్రేషన్‌ఛార్జీలను 7 వరకు పెంచినట్లు సమాచారం. ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ఆధ్వర్యంలో కేబినెట్‌ సబ్‌కమిటీ ఇచ్చిన నివేదిక నేపథ్యంలో భూముల విలువలు, రిజిస్ట్రేషన్‌ ఛార్జీల పెంపుపై ఇటీవల కేబినెట్‌ సమావేశంలో చర్చించడం జరిగింది. పెంచిన భూముల విలువ, అలాగే పెరిగిన రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంగళవారం అధికారికంగా ప్రకటించినట్లు తెలిసింది.

ఇవీ కూడా చదవండి

Big Relief: స్వర్ణకారులకు గుడ్‌న్యూస్‌.. పాత బంగారు నగల విక్రయంపై వచ్చే లాభాలకు మాత్రమే జీఎస్టీ

Credit Card: క్రెడిట్‌ కార్డును ఇలా తెలివిగా వాడుకుంటే మంచిది.. లేకపోతే చిక్కుల్లో పడ్డట్లే..!