Telangana: కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్.. కార్డుల జారీలో కీలక మార్పులు..!
తెలంగాణ సర్కార్ దేశంలోనే చారిత్రాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టింది. దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కింది. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం.. రేషన్ కార్డుల్లో కీలక మార్పులను తీసుకువస్తోంది. ప్రభుత్వం తీసుకు రానున్న ఆ కీలక మార్పులు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

తెలంగాణ సర్కార్ దేశంలోనే చారిత్రాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టింది. దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కింది. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం.. రేషన్ కార్డుల్లో కీలక మార్పులను తీసుకువస్తోంది. ప్రభుత్వం తీసుకు రానున్న ఆ కీలక మార్పులు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డు లబ్ధి దారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అందుకనుగుణంగా ఉగాది రోజున సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో రేషన్ కార్డు లబ్ధి దారులకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం శాశ్వతంగా ఉంటుందని, ఈ పథకాన్ని రద్దు చేసే సాహసం ఎవరు చేయలేరని సీఎం రేవంత్ అన్నారు. సన్న బియ్యం పంపిణీ ద్వారా రాష్ట్రంలోని పేదలందరికీ ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సన్న బియ్యం పంపిణీ చరిత్రలోనే పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు.
అయితే ప్రభుత్వం రేషన్ కార్డుల జారీలో కీలక మార్పులు తీసుకు వస్తుంది. ప్రస్తుతం ఉన్న తెల్ల రేషన్ కార్డు స్థానంలో రెండు రకాల రేషన్ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతమున్న తెల్ల రేషన్ కార్డు కలర్ ను మార్చనుంది. తెల్ల కార్డు స్థానంలో బిపిఎల్ లబ్ధిదారులకు మూడు రంగులతో కూడిన రేషన్ కార్డును ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. బిపిఎల్ కు ఎగువ నుండే లబ్ధిదారులకు గులాబీ కార్డు బదులుగా ఆకుపచ్చ కలర్ లో రేషన్ కార్డును మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం కొత్తగా జారీ చేయనున్న రేషన్ కార్డులో క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు.. 2.85 కోట్ల లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. కొత్తగా మరో 30 లక్షల మందికి రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఏప్రిల్ 1 నుంచి అర్హులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సన్న బియ్యం పంపిణీ వల్ల రాష్ట్రంపై రూ.2,800 కోట్ల అదనపు భారం పడనుంది. రాష్ట్రంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కావాలి. ఈ స్థాయిలో బియ్యం కావాలంటే 36 లక్షలమెట్రిక్ టన్నుల ధాన్యం అవసరమవుతోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 84 శాతం మంది పేదలకు ఉచితంగా సన్నబియ్యం అందించబోతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..