Rahul Gandhi: యాత్రలో ఎవరు కలిసినా ఆ సమస్యపైనే మాట్లాడుతున్నారు.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..

|

Nov 05, 2022 | 9:42 PM

తెలంగాణలోని మెదక్ జిల్లా ఆంథోల్ నియోజకవర్గంలో రాహుల్ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు.. పెద్ద ఎత్తున వచ్చిన జనం మధ్య రాహుల్ గాంధీ జోడో యాత్ర జోరుగా సాగింది.

Rahul Gandhi: యాత్రలో ఎవరు కలిసినా ఆ సమస్యపైనే మాట్లాడుతున్నారు.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..
Rahul Gandhi
Follow us on

తెలంగాణలోని మెదక్ జిల్లా ఆంథోల్ నియోజకవర్గంలో రాహుల్ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు.. పెద్ద ఎత్తున వచ్చిన జనం మధ్య రాహుల్ గాంధీ జోడో యాత్ర జోరుగా సాగింది. ఉదయం సంగారెడ్డి జిల్లా చౌటకూరు నుంచి మొదలైన పాదయాత్ర అల్లాదుర్గ్ వరకు సాగింది. పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో పాటు మెదక్‌ జిల్లా నేతలు దామోదర రాజనర్సింహ్మ రాహుల్‌ వెంట నడిచారు. గడిపెద్దాపుర్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లోనూ రాహుల్ నోట.. మళ్లీ అదే మాట. మోదీ- కేసీఆర్ ఇద్దరూ ఒక్కటేనని ఆరోపించారు. ధరణి పోర్టల్‌తో కేసీఆర్‌కి భూములు లాక్కోవడమే తెలుసన్న ఆయన.. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రైతులు, కూలీలు, వ్యాపారులు బాధలో ఉన్నారని అన్నారు.

భారత్ జోడో యాత్రలో యువత ఏ ఒక్కర్ని కలిసినా నిరుద్యోగ సమస్య పైనే మాట్లాడుతున్నారని రాహుల్ అన్నారు. మోడీ పాలనలో నిత్యావసరాల ధరలు.. నిరుద్యోగ సమస్య పెరుగుతూనే ఉన్నాయన్నారు. దేశ ఆస్థులన్ని తన మిత్రులకు మోడీ కట్టబెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్యాస్ సిలిండర్ 400 రూపాయలు ఉంటే నానా హంగామా చేసిన మోదీ.. ఇప్పుడు 1100 రూపాయలు చేసి మధ్యతరగతిపై మోయలేని భారాన్ని మోపారని అన్నారు.

కన్యాకుమారి నుంచి శ్రీనగర్- కాశ్మీర్ వరకు సాగుతున్న భారత్ జోడో యాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నానని చెప్పారు రాహుల్. కాంగ్రెస్ శ్రేణుల ప్రేమాభిమానంతో.. పాదయాత్ర చేస్తుంటే తనకు ఎటువంటి అలసట లేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..