P. V. Narasimha Rao: తెలుగుబిడ్డకు భారతరత్న.. పీ.వీ జన్మస్థలం, దత్తత వెళ్ళిన గ్రామంలో అంబరాన్నంటిన సంబరాలు..

|

Feb 09, 2024 | 4:16 PM

పీవీ. నర్సింహారావు పుట్టింది వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామమే అయినా.. పీవీ అంటే కరీంనగర్ జిల్లావాసిగానే గుర్తంపు పొందారు.. భీమదేవరపల్లి మండలం వంగరలో పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలకు దత్తత రావడంతో ఆయన ఇంటిపేరే మారిపోయింది. అలా కరీంగనర్ జిల్లా దత్తపుత్రుడిగా వచ్చి.. రాజకీయాల్లో ఓ శిఖర సమానంగా ఎదిగారు పీవీ.. 14 భాషల్లో అనర్గళంగా మాట్లాడగల్గే భాషా పటిమ పీవీ సొంతం..

P. V. Narasimha Rao: తెలుగుబిడ్డకు భారతరత్న.. పీ.వీ జన్మస్థలం, దత్తత వెళ్ళిన గ్రామంలో అంబరాన్నంటిన సంబరాలు..
Pv Narasimha Rao Village Vangara
Follow us on

రాజకీయ రంగంలో తన ప్రస్థానాన్ని మంథని నుంచి ప్రారంభించి.. దేశ ప్రధాని స్థాయికెదిగిన తెలుగు బిడ్డ… భూ సంస్కరణలకు ఆద్యుడైన పీవీకి భారతరత్న రావడంపై పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం మవుతుంది.. ఆయన స్వగ్రామం వంగర, జన్మస్థలం లక్నేపల్లి లో ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. P.V కి భారతరత్న రావడం గర్వంగా ఉందని ఉప్పొంగిపోతున్నారు. పీవీ. నర్సింహారావు పుట్టింది వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామమే అయినా.. పీవీ అంటే కరీంనగర్ జిల్లావాసిగానే గుర్తంపు పొందారు.. భీమదేవరపల్లి మండలం వంగరలో పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలకు దత్తత రావడంతో ఆయన ఇంటిపేరే మారిపోయింది. అలా కరీంగనర్ జిల్లా దత్తపుత్రుడిగా వచ్చి.. రాజకీయాల్లో ఓ శిఖర సమానంగా ఎదిగారు పీవీ.. 14 భాషల్లో అనర్గళంగా మాట్లాడగల్గే భాషా పటిమ పీవీ సొంతం..

1952లో కరీంనగర్ నుంచి బద్ధం ఎల్లారెడ్డి వంటి నాటి పేరుమోసిన కమ్యూనిస్ట్ నేతపై ఓటమితో పీవీ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనా.. ఆ తర్వాత మంథని నుంచి 1957లో జరిగిన ఎన్నికల్లో ఆయన విజయదుందుభి మోగించారు.. 1972 వరకూ ఎమ్మెల్యేగా కొనసాగారు.

ఇవి కూడా చదవండి

ప్రత్యేక తెలంగాణా ఉద్యమమనంతరం చోటుచేసుకున్న సంఘటనలతో.. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా పగ్గాలు చేపట్టడంతో పాటు.. ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారు. దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి తెలుగోడి ఖ్యాతిని చాటారు. ఎందరు వ్యతిరేకించినా, కుట్రలు పన్నినా భూసంస్కరణలను అమలుచేసిన ఘనుడు పీవీ… అలాంటి ఎన్నో విజయాలను సాధించి తన రాజకీయ జీవితానికి ఓ ప్రత్యేకతను సాధించుకున్న పీవీకి భారతరత్న రావడం పట్ల మంథని ప్రజానీకం హర్షం వ్యక్తం చేశారు.. ఆయన స్వగ్రామం వంగర లో సంబరాలు జరుపుకున్నారు. భారతరత్న మా ఊరి బిడ్డ ఆనిముత్యమని తెగ మురిసి పోతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..