Advocates Murder: నేను ఏ అక్రమాలకు పాల్పడలేదు.. వామన్‌రావు దంపతుల హత్యపై తొలిసారిగా స్పందించిన పుట్ట మధు

|

Feb 20, 2021 | 2:29 PM

Advocates Murder: పెద్దపల్లిలో సంచలనం సృష్టించి న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్యపై తొలిసారిగా నిందితుడు పుట్ట మధు స్పందించారు. మీడియా నన్ను టార్గెట్‌ చేస్తోందని..

Advocates Murder: నేను ఏ అక్రమాలకు పాల్పడలేదు.. వామన్‌రావు దంపతుల హత్యపై తొలిసారిగా స్పందించిన పుట్ట మధు
Follow us on

Advocates Murder: పెద్దపల్లిలో సంచలనం సృష్టించి న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్యపై తొలిసారిగా నిందితుడు పుట్ట మధు స్పందించారు. మీడియా నన్ను టార్గెట్‌ చేస్తోందని అన్నారు. ఈ హత్యలపై మీడియానే విచారణ చేపట్టిందని అన్నారు. నేను ఏ అక్రమాలు చేయలేదు. నిజాలు త్వరలోనే బయట పడతాయి అని అన్నారు. కాగా, ఈ హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు- నాగమణి హత్య కేసులో మరో కీలక నిందితుడు బిట్టు శ్రీనును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బిట్టు శ్రీను పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు మేనల్లుడు కావడం గమనార్హం.

రహస్య ప్రదేశంలో అతడిని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కేసులో ఇప్పటికే కుంట శ్రీనివాస్‌ను-A1, చిరంజీవిని-A2, అక్కపాక కుమార్‌-A3 లను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వామనరావు దంపతుల హత్యలో భాగంగా రిజిస్ట్రేషన్‌ కాని బ్రీజా కారు, హత్యకు ఉపయోగించిన కత్తులను బిట్టు శ్రీను ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్‌కు సమకూర్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కుంట శ్రీను కారు డ్రైవర్‌ చిరంజీవితో కలిసి నడిరోడ్డుపైనే న్యాయవాది దంపతులపై ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఇక సొంత గ్రామం గుంజపడుగులో మృతులతో నిందితులకు నెలకొన్న గొడవలే ఈ ఘటనకు కారణమని పోలీసులు వెల్లడించారు. కుంట శ్రీనివాస్‌ ఇంటి నిర్మాణాన్ని వామన్‌రావు అడ్డుకోవడం, అదే విధంగా గ్రామంలో నిర్మాణం చేస్తున్న దేవాలయం పనులకు అభ్యంతరం తెలపడం, రామాలయ కమిటీ వివాదాల కారణంగా హత్యలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: పోలీసుల అదుపులో నాలుగో కీలక నిందితుడు.. అతడే కారు, కత్తులు సమకూర్చినట్టు అనుమానిస్తున్న పోలీసులు.