AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karimnagar: ఇదేం పనయ్యా ప్రిన్సిపాల్.. స్టాప్ రూంలో మహిళా సిబ్బంది ఒంటిరిగా కనపడితే చాలు..

చూశారు.. భరించారు.. కానీ ప్రిన్సిపాల్ ప్రవర్తన రోజురోజుకు మితిమీరింది. ఇక టార్చర్ తప్పించుకునేందుకు ఆధారాలతో ఫిర్యాదు చేసి.. అతగాడి తిక్క కుదిర్చారు.

Karimnagar: ఇదేం పనయ్యా ప్రిన్సిపాల్.. స్టాప్ రూంలో మహిళా సిబ్బంది ఒంటిరిగా కనపడితే చాలు..
Principal Harassment
Ram Naramaneni
|

Updated on: Mar 17, 2023 | 1:32 PM

Share

పిల్లలకు విద్యాబుద్దులు చెప్పి సన్మార్గంలో పెట్టాల్సిన వ్యక్తి.. స్కూల్ మొత్తం పాజిటివ్ వాతావరణంలో నడిచేలా బాధ్యత తీసుకోవాల్సిన మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్. కానీ ఆయన గుణమే మహా చెడ్డది. అచ్చోచ్చిన అంబోతులా బిహేవ్ చేయడం మొదలెట్టాడు. ట్రాక్ తప్పి..  స్కూల్లోని తోటి మహిళా సిబ్బందిని వేధించడం షురూ చేశాడు. స్టాఫ్‌ రూంలో మహిళలు ఎవరైనా ఒంటరిగా కనిపిస్తే వారిని తాకేందుకు ప్రయత్నిస్తున్నాడు. డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో వారిని ఇబ్బంది పెడుతున్నాడు. ఇన్‌డైరెక్ట్‌గా తనతో గడపాలని వేధింపులకు గురిచేస్తున్నాడు. మాట వినకపోతే ఇబ్బందులు తప్పవని బెదిరిస్తున్నాడు. దీంతో మహిళా సిబ్బంది ఆగ్రహం కట్టలు తెగింది. అతడి చేష్టలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పక్కాగా సేకరించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు కాపీకి అందజేశారు. దీంతో సస్పెన్షన్ వేటు పడింది.

ఈ కీచక ప్రిన్సిపాల్ పేరు ఎం.శ్రీనివాస్‌. జగిత్యాల జిల్లాలోని రాయికల్‌ మండలం ఇటిక్యాలలోని మోడల్‌ కాలేజీకి ప్రిన్సిపాల్‌గా ఉద్యోగం వెలగబెడుతున్నాడు. అతడి మాట వింటే ఓకే.. లేదంటే క్రమశిక్షణా చర్యలు పేరుతో మహిళా సిబ్బందిని వేధిస్తాడు. వారు రావడం నిమిషం ఆలస్యమైనా మెయిన్‌ గేట్లు క్లోజ్ చేస్తాడు, అందరి ముందు పరువు తీసే మాటలతో దెప్పి పొడుస్తాడు. ఇలాంటి వాతావరణంతో విసిగి.. వేసారిపోయిన మహిళా సిబ్బంది పక్కా ప్రణాళికతో.. పక్కా ఆధారాలతో అతడి తిక్క కుదిర్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం