Narendra Modi: తెలంగాణ ఎన్నికలపై ఓటర్లకు మోదీ ఇచ్చిన సందేశం ఇదే..

| Edited By: Ravi Kiran

Nov 30, 2023 | 9:42 AM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. దీనిపై ఇప్పటికే అన్ని మీడియా సంస్థలు, ఎన్నికల అధికారులు అవగాహనా కార్యక్రమాలను నిర్వహించారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా జరిగే 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.

Narendra Modi: తెలంగాణ ఎన్నికలపై ఓటర్లకు మోదీ ఇచ్చిన సందేశం ఇదే..
Prime Minister Narendra Modi Reacts On Telangana Assembly Election Polling On Twitter
Follow us on

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. దీనిపై ఇప్పటికే అన్ని మీడియా సంస్థలు, ఎన్నికల అధికారులు అవగాహనా కార్యక్రమాలను నిర్వహించారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా జరిగే 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ‘తెలంగాణలోని నా సోదర, సోదరీమణులు రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని నేను పిలుపునిస్తున్నాను. యువకులు మరీ ముఖ్యంగా మొదటిసారిగా ఓటు వేస్తున్న వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను’. అంటూ రాసుకొచ్చారు.

ఈ ట్వీట్ తెలంగాణ ఎన్నికలను ఉద్దేశించి ఓటర్లను జాగరూకులను చేసేందుకు తెలుగు అక్షరాల్లో అవగాహనాత్మక సందేశం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మన్నటి వరకూ ఎన్నికల ప్రచారంలోనూ తెలుగులో మాట్లాడి అందరినీ ఆకర్షించారు మోదీ. ఈ నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకోండి అని ముఖ్యంగా యువత, మహిళలకు పిలుపు ఇవ్వడం గమనార్హం.

కేటీఆర్ స్పందన..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. తన ఎక్స్ (ట్విట్టర్)లో ఒక సందేశాన్ని ఇచ్చారు. ‘మీ ఓటు తెలంగాణ ప్రగతికి పునాదిగగా నిలవాలి.. మీ ఓటు.. తెలంగాణ ఉజ్వల భవితకు బంగారు బాటలు వేయాలి’ అంటూ కవితాత్మక సందేశాన్ని ఇచ్చారు.

 

రాహుల్ ట్వీట్..

ఇదిలా ఉంటే రాహూల్ గాంధీ కూడా తెలంగాణ ఓటర్లపై స్పందించారు. ‘నేడు దొరలపై ప్రజలు గెలవబోతున్నారు. నా తెలంగాణ సోదర సోదరీమణులారా! రండి.. అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనండి. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఓటేయండి! కాంగ్రెస్‌ను గెలిపించండి!’ అంటూ రాసుకొచ్చారు.

పోలింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

తెలంగాణ పోలింగ్ కవరేజ్ కోసం..

పోలింగ్ లైవ్ వీడియో కోసం కింద క్లిక్ చేయండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..