Telangana: టెట్ పరీక్షా కేంద్రంలో విషాదం… ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన గర్భిణీ
టెట్ పరీక్షకు వెళ్లే తరుణంలో సమయం మించి పోతుంది అనే తొందరలో రాధిక పరీక్ష సెంటర్‌కు వేగంగా చేరుకుంది. ఈ సమయంలో రాధికకు ఒక్కసారి బీపీ ఎక్కువై, చెమటలొచ్చి పరీక్షా గదిలోనే స్పృహ తప్పి పడిపోవడంతో అక్కడ ఉన్న ఇన్విజిలేటర్, తోటి విద్యార్థులు అందరూ షాక్ అయ్యారు. వెంటనే రాధిక ను పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాధిక భర్త అరుణ్ కూడా ఎగ్జామ్ హాల్...

టెట్ పరీక్షా కేంద్రంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లాలో ఈ విషాద సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం టెట్ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో టెట్ పరీక్షకు హాజరైంది రాధిక అనే అభ్యర్థినీ. 8 నెలల గర్భిణీ అయిన రాధిక పరీక్షను ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదనే ఉద్దేశంతో హాజరైంది.
టెట్ పరీక్షకు వెళ్లే తరుణంలో సమయం మించి పోతుంది అనే తొందరలో రాధిక పరీక్ష సెంటర్‌కు వేగంగా చేరుకుంది. ఈ సమయంలో రాధికకు ఒక్కసారి బీపీ ఎక్కువై, చెమటలొచ్చి పరీక్షా గదిలోనే స్పృహ తప్పి పడిపోవడంతో అక్కడ ఉన్న ఇన్విజిలేటర్, తోటి విద్యార్థులు అందరూ షాక్ అయ్యారు. వెంటనే రాధిక ను పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాధిక భర్త అరుణ్ కూడా ఎగ్జామ్ హాల్ దగ్గర ఉన్నాడు. అయితే ప్రభుత్వాసుపత్రికి చేరుకునే సరికి రాధిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఆసుపత్రికి చేరుకోగానే వైద్యులు వెంటనే చికిత్స అందించేందుకు ప్రయత్నం చేశారు. అయితే రాధిక మార్గమధ్యంలోనే ప్రాణాలు వదిలినట్లు వైద్యులు గుర్తించారు. టెట్ పరీక్ష రాసి జీవితంలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని కళలు కన్న రాధిక కలలు అన్ని ఆవిరి అయిపోయాయి..రాధిక హఠాన్మరణంతో ఆమె కుటుంబ సభ్యలు కన్నీరు మున్నీరు అయ్యారు. రాధిక అమ్మ వారి ఇల్లు,అత్తగారి ఇల్లు రెండు కూడా తీవ్ర విషదంలో మునిగిపోయాయి.
ఇదిలా ఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 1139 పరీక్షా కేంద్రాల్లో టెట్ పరీక్షను నిర్వహిస్తున్నారు. మొత్తం రెండు సెషన్స్‌లో పరీక్షను నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్ ముగియగా, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగుతుంది. టెట్ పరీక్ష నిర్వహణకు అధికారులు కట్టుదిట్టంగా చేపట్టారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా పరీక్షను పర్యవేక్షిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
