AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: దవాఖానాల తీరు ఇక మారదా..? పాపం నిండు గర్భిణీ ప్రసవం కోసం వస్తే..!

అది జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి. కానీ అక్కడే వైద్యుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తుంది. పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన గర్భిణి పట్ల వైద్యుల చూపిన నిర్లక్ష్యంతో.. ఆ మహిళ కుర్చీలోనే డెలివరీ అయింది.

Telangana: దవాఖానాల తీరు ఇక మారదా..? పాపం నిండు గర్భిణీ ప్రసవం కోసం వస్తే..!
Nalgonda Mother Child Health Center
M Revan Reddy
| Edited By: Balaraju Goud|

Updated on: Aug 23, 2024 | 1:57 PM

Share

ఎన్ని విమర్శలు వస్తున్నా సరే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది తీరు మాత్రం మారడం లేదు. అది జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి. కానీ అక్కడే వైద్యుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తుంది. పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన గర్భిణి పట్ల వైద్యుల చూపిన నిర్లక్ష్యంతో.. ఆ మహిళ కుర్చీలోనే డెలివరీ అయింది.

నల్లగొండ జిల్లా నేరేడుగోమ్మకు చెందిన అశ్వినికి పురిటి నొప్పులు రావడంతో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నల్లగొండ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి శుక్రవారం(ఆగస్ట్ 23) తెల్లవారు జామున తరలించారు. మూడవ కాన్పుకు పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ ఆస్పత్రిలో చేర్చుకోవడానికి వైద్య సిబ్బంది నిరాకరించింది. పురిటి నొప్పులు వస్తున్నాయని చెప్పినా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆసుపత్రిలో చేర్చుకోవడానికి ఒప్పుకోకపోవడంతో గర్భిణీ అశ్వనీ కుర్చీలో కూర్చుండగానే తీవ్ర రక్తస్రావం అయింది. కుర్చీలోనే అశ్విని మగ బిడ్డకు జన్మనిచ్చింది. పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన తన కూతురిని ఆసుపత్రిలో చేర్చుకునేందుకు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఎంత బతిమాలినా వైద్యులు సిబ్బంది పట్టించుకోలేదని అశ్విని బంధువులు ఆరోపిస్తున్నారు. గత్యంతరం లేక కుర్చీలోనే కూర్చొని తీవ్ర రక్తస్రావంతో ప్రసవించిందని చెబుతున్నారు.

దీంతో రక్తస్రావం చూసిన వైద్యులు, వైద్య సిబ్బంది ఒక్కసారిగా పరుగులు పెట్టి నానా హంగామా చేశారు. పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ పట్ల నిర్లక్ష్యం వహించిన వైద్యుల తీరుపై బాధితురాలి కుటుంబ సభ్యులు మండి పడుతున్నారు. తక్షణమే వైద్య సిబ్బందిని సస్పెండ్ చేయాలంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు హస్పటల్ ముందు ఆందోళనకు దిగారు. విష‌యం తెలుసుకున్న అద‌న‌పు క‌లెక్టర్ పూర్ణ చంద‌ర్ హాస్పట‌ల్ వ‌చ్చారు. వెంట‌నే ఘ‌ట‌నకు బాధ్యులైన వారిపై చ‌ర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రభుత్వ వైద్య సేవ కోసం వచ్చే నిరుపేద రోగుల పట్ల ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా చూడాలంటూ అధికారులను సిబ్బందిని ఆదేశించారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..