AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Water row: అది చిల్లర వ్యవహారం.. ఏపీ ప్రభుత్వ ఫిర్యాదుపై మండిపడిన తెలంగాణ మంత్రి

సాగర్‌లో నీటి విడుదలపై కేఆర్ఎంబీకి( KRMB) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాయడంపై తీవ్రంగా మండిపడ్డారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ కు..

Water row: అది చిల్లర వ్యవహారం.. ఏపీ ప్రభుత్వ ఫిర్యాదుపై మండిపడిన తెలంగాణ మంత్రి
Jagadish Reddy
Sanjay Kasula
|

Updated on: Apr 05, 2022 | 6:04 PM

Share

సాగర్‌లో నీటి విడుదలపై కేఆర్ఎంబీకి( KRMB) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాయడంపై తీవ్రంగా మండిపడ్డారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు. కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ కు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేయడం చిల్లర వ్యవహరమన్నారు. అసంబద్ధమైన ఆరోపణలు , ఫిర్యాదులు చేసి ఏపీ ప్రభుత్వం గౌరవాన్ని దిగజార్చుకుంటుందన్నారు. నాగార్జున సాగర్ నుండి విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని తెలంగాణ వినియోగించడం లేదని స్పష్టం చేశారు. నాగార్జునసాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి పచ్చి అబద్ధం అని అన్నారు. ఏపీ సర్కార్ చేస్తున్న ఫిర్యాదుల్లో ఎలాంటి నిజం లేదన్నారు. డిమాండ్ ఎక్కువ ఉన్న సమయంలో గ్రిడ్ ని కాపాడేందుకు మాత్రమే 5 నిమిషాలు నీళ్లు వదులుతారన్నారు. తాగునీరు తమకు కూడా ముఖ్యమేనన్నారు మంత్రి జగదీష్‌ రెడ్డి.

శ్రీశైలం నుంచి తెలంగాణ ఉత్పత్తి ఆపేసిన ఆంధ్రప్రదేశ్ కోనసాగిస్తుందని అయినా తాము చిల్లర ఫిర్యాదులు చేయడం లేదన్నారు. సమైక్య ఆంధ్రలో దుర్మార్గంగా నీటిని ఆంధ్రప్రదేశ్‌కు బలవంతంగా తరలించుకెళ్ళారని గుర్తు చేశారు. ఆంధ్ర ప్రభుత్వానికి నీటి యాజమాన్యం తెలీక తమ పై ఫిర్యాదు చేస్తున్నారని విమర్శించారు.

ఇదిలావుంటే, కృష్ణా నదీ యాజమాన్య బోర్టుకు ఏపీ సర్కార్ లేఖ రాసింది. విద్యుత్‌ ఉత్పత్తికి సాగర్‌ నుంచి తెలంగాణ నీటి వినియోగం అడ్డుకోవాలని ఈ లేఖలో పేర్కొంది. తాగు నీటికి లేకుండా విద్యుత్‌ ఉత్పత్తికి ఎలా చేస్తారంటూ లేఖలో ప్రశ్నించింది. కృష్ణా నీటిని తెలంగాణ దుర్వినియోగం చేస్తుందని ఏపీ ప్రభుత్వం ఆ లేఖలో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి లేఖలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: Viral Video: ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో.. అమ్మను ముద్దాడింది.. వెళ్లిపోయింది.. వీడియో చూస్తే మీరు అదే అంటారు..

Drugs Case: హాష్ ఆయిల్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్.. విచారణ ముమ్మరం చేసిన నార్కోటిక్ వింగ్..

Sanjay Raut: శివసేన ఎంపీ ఆస్తులపై ఈడీ దాడులు.. మనీలాండరింగ్ చేసినట్లుగా ఆరోపణలు..