Rythu Bandhu: ‘రైతుబంధు’ చుట్టూ తెలంగాణ రాజకీయం.. కవిత ఫైర్.. రేవంత్ కౌంటర్.. ఏమన్నారంటే..?
అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ రాజకీయం మళ్లీ రైతు బంధు వైపు మళ్లింది.. ఇటీవల రైతుబంధు పథకం నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్నికల సంఘం.. తాజాగా అందిన ఫిర్యాదులు.. అభ్యంతరాల నేపథ్యంలో బ్రేక్ వేస్తూ నిర్ణయం తీసుకుంది. రైతుబంధు నిధులను ప్రస్తుతం విడుదల చేయవద్దంటూ ప్రభుత్వానికి సూచించింది.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ రాజకీయం మళ్లీ రైతు బంధు వైపు మళ్లింది.. ఇటీవల రైతుబంధు పథకం నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్నికల సంఘం.. తాజాగా అందిన ఫిర్యాదులు.. అభ్యంతరాల నేపథ్యంలో బ్రేక్ వేస్తూ నిర్ణయం తీసుకుంది. రైతుబంధు నిధులను ప్రస్తుతం విడుదల చేయవద్దంటూ ప్రభుత్వానికి సూచించింది. హరీష్ రావు ప్రకటన ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్టు స్పష్టమవుతోందని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ కారణంగా రైతుబంధు నిధుల విడుదలకు నవంబర్ 25న తాము జారీ చేసిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. దీనిపై అధికార పార్టీ బీఆర్ఎస్ .. కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీకి రైతులు బుద్ధి చెప్పాలి.. కవిత..
రైతుబంధు నిధులు విడుదల కాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఈసీ వెంటపడి రైతుబంధు ఆపారని మండిపడ్డారు. తమ నోటికాడ బుక్క లాక్కున్న కాంగ్రెస్ పార్టీకి రైతులు బుద్ధి చెప్పాలని ఆమె కోరారు. కాంగ్రెస్ వల్లే రైతుబంధు, రైతు రుణమాఫీ నిధులు పూర్తిస్థాయిలో రైతులకు అందలేదని కవిత విమర్శించారు. రైతుబంధు ఆన్‌గోయింగ్ కార్యక్రమం.. ఇది ఎన్నికల ముందు పెట్టిన కార్యక్రమం కాదంటూ పేర్కొన్నారు. ఇంకా ఎన్నికల మేనిఫెస్టోలోనూ పెట్టింది కాదన్నారు. మళ్లీ కాంగ్రెస్ రైతు వ్యతిరేకత చాటుకుందని.. రైతులంతా కేసీఆర్ వైపు ఉన్నారన్న అభద్రతతో..కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారంటూ కవిత వ్యాఖ్యానించారు. రైతుబంధు కావాలో.. రాబంధులు కావాలో ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.
వీడియో చూడండి..
రైతులు ఆందోళన చెందవద్దు.. రేవంత్ రెడ్డి
కాగా.. రైతుబంధు విడుదలకు ఈ బ్రేక్ వేయడంపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో షేర్ చేశారు. ‘‘రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామా – అల్లుళ్లకు లేదు. హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనం. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదు. రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందవద్దు. పది రోజుల్లో కాంగ్రెస్ రాగానే రూ.15 వేల రైతు భరోసా మీ ఖాతాల్లో వేస్తాం’’.. అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..