Munugode-Bypoll: మునుగోడు ఎన్నికల హోరు.. హవాలా మనీ సప్లై జోరు.. ఇల్లీగల్ ట్రాన్స్‌పర్స్‌కు.. బైపోల్‌కు సంబంధం ఉందా?
ఓవైపు మునుగోడు ఎన్నికల హోరు.. మరోవైపు హవాలా మనీ సప్లై జోరు.. ఎలక్షన్ టైమ్‌లోనే ఇంత మొత్తంలో హవాలా ఎందుకు జరుగుతోంది..? ఈ ఇల్లీగల్ ట్రాన్స్‌పర్స్‌కు.. బైపోల్‌కు సంబంధం ఉందా? అసలు ఏం జరుగుతోంది..?

మొన్న జూబ్లీహిల్స్‌లో రెండున్నర కోట్లు.. నిన్న గాంధీనగర్ పీఎస్ పరిధిలో మూడున్నర కోట్ల రూపాయలు సీజ్.. అంతకు మందు పాతబస్తీలో బయటపడ్డ నోట్ల కట్టలు. హైదరాబాద్ కేంద్రంగా ఇలా వరుసగా హవాలా మనీ పట్టుబడుతూనే ఉంది. తాజాగా గాంధీ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో భారీగా హవాలా నగదు పట్టుబడింది. ట్యాంక్‌బండ్‌కు సమీపంలోని హోటర్ మారియట్ అది. భారీగా హవాలా నగదును తరలిస్తున్నట్లు నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్, గాంధీనగర్ పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. వెంటనే హోటల్‌పై అధికారులు మెరుపు దాడులు చేశారు. ఏకంగా మూడున్నర కోట్ల రూపాయలు సీజ్ చేశారు. గండి సాయికుమార్ రెడ్డికి.. వెంకటేశ్వర్ అనే వ్యక్తి 3.5 కోట్ల నగదు ఇచ్చాడు. ఆ నగదును సైదాబాద్‌లో ఉండే బాలు, మహేందర్‌కు ఇవ్వాలని సూచించాడు. ఇదే సమయంలో పోలీసులు అక్కడికి చేరుకుని.. నగదుతో పాటు 7 సెల్‌ఫోన్లు, రెండు కార్లను సీజ్ చేశారు.
ఇక ఈనెల 9వ తారీఖున హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఈ తనిఖీల్లో 79 లక్షల హవాలా డబ్బును పట్టుకున్నారు. రెండు కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఢిల్లీకి చెందిన ఇద్దరితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
సంతోష్‌నగర్ నుంచి కాటేదాన్ రూట్‌లో తనిఖీలు చేస్తున్న పోలీసులకు చాంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్ దగ్గర రెండు కార్లు అనుమానాస్పదంగా కనిపించాయి. వారిని విచారించగా వాహనాల్లో ఉన్న 79 లక్షల హవాలా డబ్బు పట్టుబడింది. అలాగే గత నెల 29న కూడా హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లో భారీగా హవాలా మనీ పట్టుబడింది. శాంతినగర్‌లో నివాసం ఉంటున్న షోయబ్ మాలిక్ దగ్గర ఏకంగా కోటీ24 లక్షల రూపాయల స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
ఇలా వరుసగా హవాలా మని పట్టుబడడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సెడ్యూల్ వచ్చిన నాటి నుంచే హవాలా డబ్బు పట్టుబడుతుందా అనే అనుమానం పోలీసులకు కలుగుతుంది. ఈ డబ్బు వెనక ఎవరు ఉన్నారనేది ఇప్పటికైతే బయటపడలేదు. కానీ ఇంత పెద్ద మొత్తంలో లావాదేవీల వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయనే ఆరోపణలు మాత్రం వస్తున్నాయి.
మరిన్ని మునుగోడు ఉప ఎన్నికల వార్తల కోసం
