అభిషేక్‌రావు ఇంటరాగేషన్‌పై ఉత్కంఠ.. నేటి వార్తా పత్రికల్లోని ప్రధాన వార్తలు ఇవే..!
అభిషేక్‌రావు ఇంటరాగేషన్... మునుగోడు ఉపఎన్నిక.. రాహుల్ జోడో యాత్ర.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక.. కేసీఆర్ జాతియ రాజకీయాలు... వార్తాపత్రికల్లో నేటి బర్నింగ్ టాపిక్స్‌పై ఓ లుక్కేద్దాం పదండి..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ చేపట్టిన ముత్తాగౌతమ్ విచారణ పూర్తయింది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘంగా విచారించారు ఈడీ అధికారులు. లిక్కర్ స్కామ్‌పై పలు కోణాల్లో ప్రశ్నించిన అధికారులు.. కొత్త లింక్స్, పొలిటికల్ లీడర్స్‌తో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. బోయినపల్లి అభిషేక్ నుంచి వచ్చిన నిధులపై కూడా ఆరా తీశారు. అటు.. బోయినపల్లి అభిషేక్‌రావు కస్టడీ రిపోర్టును సీబీఐ సమర్పించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో లింకులున్నట్టు రిపోర్టులో పేర్కొంది. నేషనల్ మీడియా సెంటర్ యజమాని అర్జున్‌పాండేను నిందితుడిగా నిర్ధారించింది సీబీఐ. విజయ్ నాయర్ స్టేట్‌మెంట్ ఆధారంగానే అభిషేక్‌ను అరెస్టు చేశారు. లిక్కర్ స్కామ్‌లో అభిషేక్‌రావుది కీలక పాత్ర ఉందని తేల్చింది. ఆ విశేషాలతో పాటు నేటి వార్త పత్రికల్లోని.. ప్రధానాంశాలపై విళ్లేషణ నేటి న్యూస్ వాచ్‌లో…
Published on: Oct 12, 2022 07:33 AM
వైరల్ వీడియోలు
Latest Videos