Bowenpally Kidnap Case: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో కీలక సమాచారం రాబట్టిన పోలీసులు.. రీ కన్‌స్ట్రక్షన్ సీన్‌తో..

Bowenpally Kidnap Case: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో కీలక సమాచారం రాబట్టిన పోలీసులు.. రీ కన్‌స్ట్రక్షన్ సీన్‌తో..
Telangana-Police

Bowenpally Kidnap Case: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మల్లికార్జున్ రెడ్డి, సంపత్‌ను పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు. కిడ్నాప్ గ్యాంగ్..

Shiva Prajapati

| Edited By: Pardhasaradhi Peri

Jan 21, 2021 | 12:13 PM

Bowenpally Kidnap Case: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మల్లికార్జున్ రెడ్డి, సంపత్‌ను పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు. కిడ్నాప్ గ్యాంగ్ కోసం గుంటూరు శ్రీను కూకట్‌పల్లిలోని ఓ లాడ్జిలో గదులు అద్దెకు తీసుకున్నట్లు నిందితులిద్దరూ వెల్లడించారు. బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మల్లికార్జున్ రెడ్డి, సంపత్‌లు పోలీసు కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. రెండో రోజు కస్టడీలో భాగంగా నిందితులను ఇవాళ విచారించనుండగా.. మొదటి రోజు కస్టడీలో భాగంగా బుధవారం విచారించారు. తొలిరోజు కస్టడీలో నిందితులు కీలక సమాచారాన్ని పోలీసులకు వెల్లడించారు.

వీరు ఇచ్చిన సమాచారంతో ఈ కిడ్నాప్ కేసులో దేవి ప్రసాద్, భాను, కృష్ణ వంశీ రాగులు అంజయ్య, రవి చంద్ర, చంటి, బానోతు సాయి, దేవర కొండ కృష్ణ, నాగరాజు, శివ ప్రసాద్, మీసాల శిను, షేక్ ప్రమేయంపై క్లారిటీ వచ్చినట్లయింది. ప్రవీణ్ రావు, నవీన్ రావు, సునీల్ రావులను కిడ్నాప్ చేయడానికి ముందు నాలుగు సార్లు రెక్కీ చేసినట్లు నిందితులిద్దరూ ఒప్పుకున్నారు. ఈనెల 5వ తేదీన సంపత్, మల్లికార్జున్, బాల్ చెన్నయ్య కలిసి బాధితుల ఇంటి వద్ద రెక్కీ నిర్వహించినట్లు తేలగా.. ఆ అంశంపై నేటి కస్టడీలో పోలీసులు విచారించనున్నారు. ఇక విచారణలో భాగంగా నిందితులిద్దరినీ ఇవాళ ఘటనా స్థలానికి తీసుకువెళ్లి సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. బాధితులను ఎలా కిడ్నాప్ చేశారు, డాక్యుమెంట్స్‌పై సంతకాల విషయంలో బాధితులను ఎలా బెదిరించారు? అనే అంశంపై కూలంకశంగా పరిశీలించనున్నారు. కాగా, పరారీలో ఉన్న భార్గవ్, విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీను వివరాలను పోలీసులు తెలుసుకుంటున్నారు.

Also read:

India Corona Cases: దేశంలో కొత్తగా 15,223 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా

Bhuma Akhila Priya: భూమా అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌పై నేడు సెషన్స్ కోర్టులో విచారణ.. ఈసారైనా బెయిల్ వచ్చేనా..?

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu