AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana News: ఇదేంది సామీ.. వారికి అనుకూలంగా ఉన్నవారికే అనుకున్న చోట్ల పోస్టింగ్‌లు..

ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీస్ అధికారుల పోస్టింగులు చర్చకు దారి తీస్తున్నాయి. ప్రజాప్రతినిధులకు అనుకూలంగా ఉన్న అధికారులకే మంచి పోస్టింగులు దక్కినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు లేఖలు ఇచ్చి వారి వారి నియోజకవర్గాల్లో నచ్చిన పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్ ఇస్తున్నారు. ఉన్నతాధికారులు ఒకవేళ వేరే అధికారులను పోస్టింగ్ వేయిస్తే మళ్లి మార్పించి తమకు నచ్చిన వారినే తెచ్చుకుంటున్నారు. మొన్నటి వరకు డీఎస్పీ పోస్టింగ్ లు , తాజాగా హైదరాబాద్ లో సిఐల బదిలీలలోనూ ఈ విషయం బహిర్గతం అయ్యింది. ఇక ఒక ఎమ్మెల్యే తీరు తీవ్ర చర్చనీయం అయింది.

Telangana News: ఇదేంది సామీ.. వారికి అనుకూలంగా ఉన్నవారికే అనుకున్న చోట్ల పోస్టింగ్‌లు..
Telangana Police
Vijay Saatha
| Edited By: |

Updated on: Aug 10, 2023 | 8:26 PM

Share

ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీస్ అధికారుల పోస్టింగులు చర్చకు దారి తీస్తున్నాయి. ప్రజాప్రతినిధులకు అనుకూలంగా ఉన్న అధికారులకే మంచి పోస్టింగులు దక్కినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు లేఖలు ఇచ్చి వారి వారి నియోజకవర్గాల్లో నచ్చిన పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్ ఇస్తున్నారు. ఉన్నతాధికారులు ఒకవేళ వేరే అధికారులను పోస్టింగ్ వేయిస్తే మళ్లి మార్పించి తమకు నచ్చిన వారినే తెచ్చుకుంటున్నారు. మొన్నటి వరకు డీఎస్పీ పోస్టింగ్ లు , తాజాగా హైదరాబాద్ లో సిఐల బదిలీలలోనూ ఈ విషయం బహిర్గతం అయ్యింది. ఇక ఒక ఎమ్మెల్యే తీరు తీవ్ర చర్చనీయం అయింది. విఐపీ జోన్లో ఉంటున్న ఆ ఎమ్మెల్యే పట్టుబడ్డాడు అంటే కచ్చితంగా ఆ వ్యక్తికి పోస్టింగ్ ఇవ్వాల్సిందే. ఒకవేళ వేరే వ్యక్తికి పోస్టింగ్ ఇచ్చిన పట్టుమని పది రోజులు కూడా ఉంచకుండానే సదరు సిఐని ఆ పోస్టులో నుండి లేపేసి మరోచోటికి బదిలీ చేస్తున్నారు.

ఇక రానున్న ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ అధికారుల బదిలీలు జరిగాయి. మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఒకే చోట పనిచేస్తున్న వాళ్లను బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పోలీస్ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. ఎస్సై నుంచి అదనపు ఎస్పీ వరకు జరిగిన బదిలీల్లో ప్రజాప్రతినిధుల సిఫార్సులు ప్రభావం చూపించాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో పోలీసుల పాత్ర కీలకంగా ఉంటుంది. శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా ఎన్నికలకు సంబంధించిన ప్రచారాలు, ర్యాలీలు, సమావేశాలు, బహిరంగ సభలను పోలీసులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని ఎస్సై నుంచి డీఎస్పీ పోస్టు వరకు అనుకూలంగా ఉన్న వాళ్లకు లేఖలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

ఎమ్మెల్యేల సిఫార్సు లేఖల కోసం కొంతమంది పోలీస్ అధికారులు క్యూ కట్టి మరీ వాటిని దక్కించుకున్నారు. ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకోవడానికి పోలీస్ అధికారులు, పరిచయాలను ఉపయోగించుకున్నారు. బంధుత్వం లేదా ఇతర పరిచయాలను ఆధారంగా చేసుకొని సిఫార్సు లేఖలను తీసుకొని ఉన్నతాధికారులతో బదిలీ చేయించుకుంటున్నారు. ఒకవేళ ఉన్నతాధికారులు వేరే అధికారులకెవరికైనా పోస్టింగ్ ఇస్తే ఎమ్మెల్యేలు ఒత్తిడి తెచ్చి మరి ఆ పోస్టింగులను రద్దు చేయించి అనకూలమైన వాళ్లకే పోస్టింగ్ ఇప్పించుకున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ పోలీస్ పోస్టింగ్ లే ఇందుకు ఉదాహరణ. జూబ్లీహిల్స్ సిఐ తో పాటు స్థానిక ఎసీపీ పోస్టింగ్ లోను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేదే పై చేయి.

ఇవి కూడా చదవండి

ఈ తరహా బదిలీలన్నీ రద్దు చేయాలని సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి డీజీపీ అంజనీ కుమార్ కు లేఖ రాశారు. ప్రజాప్రతినిధుల కోర్టు 500 కేసులను విచారిస్తే కేవలం 8 కేసుల్లో మాత్రమే నామమాత్రపు జరిమానా ప్రజాప్రతినిధులకు విధించినట్లు పద్మనాభరెడ్డి లేఖలో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులకు సంబంధించి సరైన సాక్ష్యాధారాలను పోలీసులు సమర్పించకపోవడం వల్ల కోర్టు శిక్ష విధించలేకపోయిందని పద్మనాభరెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు అనుకూలంగా ఉన్న పోలీసు అధికారులు ఉంటే వాళ్లపై ఉన్న కేసులకు సంబంధించి వ్యతిరేకంగా ఎలా దర్యాప్తు చేస్తారని పద్మనాభరెడ్డి డీజీపీ రాసిన లేఖలో ప్రస్తావించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు