మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కురవి మండల కేంద్రంలో డీసీఎమ్ వ్యాన్ డ్రైవర్ ర్యాష్ గా డ్రైవింగ్ చేస్తుండడంతో రోడ్డు పై వ్యాన్ ని ఆపి, యువకులు నిలదీస్తుండగా దారుణం జరిగింది. డీసీఎం వ్యాన్ డ్రైవర్‌తో మాట్లాడుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ డీసీఎంని ఢీకొట్టింది. దీంతో వ్యాన్ యువకులకపై దూసుకురావడంతో శివరామకృష్ణ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. డీసీఎం కిందపడిన మరో యువకుడి పరిస్థితి విషమంగా మారింది. ఈ ప్రమాద దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షల్లో ఎన్నికైన శివరామకృష్ణకి ఏడాది క్రితమే వివాహం జరిగింది.
ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఇరువురి మధ్య ఘర్షణను నివారించేందుకు వెళ్లిన పోలీసుకి ఇరువర్గాల నుంచి దూషణలు ఎదురయ్యాయి. హైదరాబాద్ పాతబస్తీ రైస్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానికంగా గొడవ జరుగుతుంటే పోలీస్ కంట్రోల్ రూమ్ కి కాల్ వచ్చింది. సమాచారం అందుకున్న పోలీస్ అధికారులు అరుణ్ కుమార్ మహముద్ ఇద్దరూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. గొడవ జరుగుతుంటే కాపాడే ప్రయత్నం చేసిన పోలీసు అధికారుల పైనా స్థానికులు చేయి చేసుకుంటూ… దూషిస్తూ…అక్కడి నుంచి గెంటివేశారు. ఇంత జరిగినా రైన్ బజార్ ఇన్స్పెక్టర్ చర్యలు తీసుకోలేదన్నఆరోపణలు వస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..